![సాఫ్ట్ టెన్నిస్ చాంపియన్ ఎన్టీఆర్, గుంటూరు జట్లు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/09knl37-200003_mr-1739131255-0.jpg.webp?itok=87DoSjvn)
సాఫ్ట్ టెన్నిస్ చాంపియన్ ఎన్టీఆర్, గుంటూరు జట్లు
కర్నూలు (టౌన్): రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ సాఫ్ట్ టెన్నిస్ పోటీల్లో ఎన్టీఆర్ (బాలురు), గుంటూరు (బాలికల) జట్లు విజేతగా నిలిచాయి. స్థానిక కర్నూలు క్లబ్‌లోని టెన్నిస్ మైదానంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న ఈ పోటీలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. విజేతలకు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు రామాంజనేయులు ట్రోఫీలు, పతకాలు, బహుమతులు అందజేశారు. బాలుర వ్యక్తిగత సింగిల్స్ విభాగంలో పి.వి. సింహాన్, సన్నీ, ధ్యానేశ్వర్ వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించి పతకాలు కై వసం చేసుకున్నారు. అలాగే బాలికల విభాగంలో వైశాలి, లిల్లీ గ్రేస్, సాహితీలు వరుసగా మొదటి, రెండో, మూడవ స్థానాలు సాధించారు. బాలుర విభాగంలో ఎన్టీఆర్, గుంటూరు, కాకినాడ జట్లు, బాలికల విభాగంలో గుంటూరు, కాకినాడ, శ్రీకాకుళం జట్లు వరుసగా మూడు స్థానాల్లో నిలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment