వివరాలు వెల్లడిస్తున్న సీఐ హనుమంతు నాయక్
చాగలమర్రి: మండల కేంద్రం చాగలమర్రిలో గత నెల డిసెంబర్ 29వ తేదీన జరిగిన కారు డ్రైవర్ అస్లాం హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. తన తల్లి గురించి అసభ్యంగా మాట్లాడటంతోనే అంతమొందించినట్లు నిందితుడు పోలీసుల విచారణలో అంగీకరించాడు. ఆళ్లగడ్డ రూరల్ సీఐ హనుమంతునాయక్ స్థానిక ఎస్‌ఐ రమణయ్యతో కలిసి మంగళవారం కేసు వివరాలు వెల్లడించారు. హతుడు అస్లాం చాగలమర్రిలోని కూలూరు రస్తాలో నివాసముంటాడు. ఇతను స్నేహితుడు, నిందితుడు అయిన సుభాహాన్‌తో కలిసి తరచుగా మద్యం సేవిస్తుంటాడు. అయితే, 8 నెలల క్రితం ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సుభాహాన్ తల్లి గురించి మద్యం మత్తులో అస్లాం తరచుగా అసభ్యంగా మాట్లాడేవాడు. వారించినా తీరు మార్చుకోకపోవడంతో హత్య చేయాలని సుభాహాన్ పథకం రచించాడు. ఇందులో భాగంగా గత నెల 29వ తేదీ రాత్రి హతుడిని సాధిక్ అనే మరో స్నేహితుడి ఇంటిపైకి తీసుకెళ్లాడు. అక్కడ ఇరువురు మద్యం సేవించారు. తర్వాత వెంట తెచ్చుకున్న కారం పొడిని అస్లాం కళ్లలో చల్లి కత్తితో విచక్షణా రహితంగా పొడిచి హత్య చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని మంగళవారం స్థానిక మల్లెవేముల బస్టాండు సమీపంలో అరెస్టు చేసి, కత్తిని స్వాధీన పరుచుకున్నారు. కాగా నిందితుడు మైనర్ కావడంతో జువైనల్ హోంకు తరలించినట్లు సీఐ వెల్లడించారు.
వీడిన యువకుడి హత్య కేసు మిస్టరీ
నిందితుడిని జువైనల్ హోంకు తరలింపు
Comments
Please login to add a commentAdd a comment