‘రెవెన్యూ సదస్సు’ అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి
కర్నూలు(సెంట్రల్): రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన ప్రతి అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ పి.రంజిత్‌బాషా అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు అభి వృద్ధి, సంక్షేమ పథకాలపై మండల స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్జీల పరిష్కారంలో ఆదోని డివిజన్ 30 శాతం, పత్తికొండ, కర్నూలు డివిజన్లలో అంతకంటే తక్కువగా సమస్యలు పరిష్కారం అయ్యాయన్నా రు. రీసర్వేకు సంబంధించి నిర్వహించిన గ్రామసభల్లో వచ్చిన 18,601 అర్జీల్లో ఇప్పటి వరకు 8 వేల ఆర్జీలకు మాత్రమే పరిష్కారం చూపారని, మిగిలిన 10 వేల అర్జీలకు వెంటనే పరిష్కారాలు చూపాలన్నారు. కృష్ణగిరి, దేవనకొండ, మద్దికెర మండలాల్లో అర్జీల పరిశీలన ప్రక్రియ పెండింగ్‌లో ఉందని, ఎందుకు జాప్యం జరుగుతుందో తెలుసుకోవడానికి కలెక్టర్ ప్రయత్నించగా వారు వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరు కాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా మండలాల తహసీల్దార్లు గురువారం కలెక్టరేట్‌కు రావాలని ఆర్‌డీఓ భరత్‌నాయక్‌ను ఆదేశించారు. పత్రికల్లో ఉపాధి పనులు కల్పించడం లేదని కథనాలు వస్తున్నా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. జనవరి 10, 11, 12 తేదీ ల్లో గోకులాలను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జీఎస్‌డబ్ల్యూఎస్‌కి సంబంధించి మిస్సింగ్ సిటిజన్ హౌస్‌హోల్డ్ మ్యాపింగ్, అంగన్‌వాడీ కేంద్రాల్లో ఉండే 0 నుంచి 6 ఏళ్లలోపు పిల్లల వరకు ఆధా ర్, తదితర అంశాలను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఎంపీడీఓలను ఆదేశించారు. ఎంఎస్‌ఎంఈ సర్వేను ఫిబ్రవరి 1వ తేదీలోపు పూర్తి చేయాలని ఆదేశించారు. తాగునీటి ట్యాంకులను శుభ్రపరచడంలో 97 శాతం, క్లోరినేషన్‌లో 87 శాతం చేసినట్లు కలెక్టర్ వివరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీ డాక్టర్ నవ్య, ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కల్యాణి, డీఆర్వో సి.వెంకట నారాయణమ్మ, హౌసింగ్ పీడీ చిరంజీవి, జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అధికారులను ఆదేశించిన కలెక్టర్
పి.రంజిత్‌బాషా
Comments
Please login to add a commentAdd a comment