ప్రశాంతంగా టెట్ ప్రారంభం
కర్నూలు సిటీ: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. జిల్లాలో కర్నూలు నగరంలో 4 కేంద్రాలు, ఆదోని, ఎమ్మిగనూరులో ఒక్కొక్కటి, హైదరాబాదులో రెండు సెంటర్లు ఏర్పాటు చేశారు. 9.30 గంటలకు మొదలైన పరీక్షకు గంట ముందుగానే అభ్యర్థులు కేంద్రాల దగ్గరకు చేరుకోగా, అరగంట ముందుగానే కేంద్రాల్లోకి అనుమతించారు. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో నిర్వహించిన పరీక్షలకు 145 మంది గైర్హాజరయ్యారు. ఉదయం 632 మందికి గాను, 551 మంది హాజరుకాగా, 81 మంది గైర్హాజరైయ్యారు. మధ్యాహ్నం 630 మందికి గాను 566 మంది హాజరై, 64 మంది గైర్హాజరయ్యారు. టెట్ పరీక్ష రాష్ట్ర పరిశీలకులు నరసింహరావు ఆదోని, ఎమ్మిగనూరు, కర్నూలులోని ఒక్కో కేంద్రాన్ని తనిఖీ చేసి డిపార్లమెంట్ ఆఫీసర్లకు పలు సూచనలు చేశారు. డీఈఓ కాగిత శామ్యూల్ ఆయాన్ డిజిటల్ కేంద్రాన్ని తనిఖీ చేశారు.
145 మంది గైర్హాజరు
Comments
Please login to add a commentAdd a comment