సివిల్ సప్లై బఫర్ గోదాము తనిఖీ
కర్నూలు(సెంట్రల్):నగరంలోని రేడియో స్టేష న్ సమీపంలో ఉన్న సివిల్ సప్లై గోదామును సంస్థ రాష్ట్ర డైరెక్టర్ కొంకతి లక్ష్మీనారాయణ మంగళవారం తనిఖీ చేశారు. గోదాము ఇన్‌చార్జ్‌తో కలిసి రికార్డులను పరిశీలించారు. పేదలకు సంబంధించిన సరుకులను సకాలంలో పంపిణీ చేసేలా చూడాలని, ఏమైనా అవకతవకలకు పాల్పడినా, అక్రమాలు చేసినా సహించేది లేదని అధికారులను హెచ్చరించారు.
గ్రామ రెవెన్యూ సహాయకుల కమిటీ ఎన్నిక
కర్నూలు(సెంట్రల్): ఏపీఆర్‌ఎస్‌ఏ అనుబంధంగా గ్రామ రెవెన్యూ సహాయకుల నూతన జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మంగళవారం రెవెన్యూ భవన్‌లో ఏపీఆర్‌ఎస్‌ఏ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సి.నాగరాజు, ఎం.లక్ష్మీపతి ఆధ్వర్యంలో వీఆర్‌ఏల జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్ష, కార్యద ర్శులుగా ఎన్.చిన్నస్వామి, టీ.శేఖర్, జిల్లా సహాధ్యక్షుడిగా పామప్ప, ఉపాధ్యక్షులుగా టి. వెంకటేష్, ఎం.రఘు, ఎన్.రవి,అనిల్, రమేష్, ట్రెజరర్‌గా ఈ.ఎల్లారెడ్డి, సంయుక్త కార్యదర్శులుగా తాయప్ప, రఘు, గోవిందు, వినయ్‌కుమార్, నరసింహులు, కార్యవర్గ సభ్యులుగా కేశన్న, టి.పెద్దగాజు లింగ, పరమేష్, రామాంజనేయులు,ఆనంద్, పులికొండ, రేణుక, ఉమాదేవిలు ఎన్నికయ్యారు. కార్యక్రమంలో గ్రామ రెవెన్యూ సహాయకుల రాష్ట్ర అధ్యక్షుడు గరిక పాటి బ్రహ్మయ్య, రాస్ట్ర సహాధ్యక్షుడు టీజీ రామాంజనేయులు, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ జగశెట్టిసతీస్, జాయింట్ సెక్రటరీ రాఘవేంద్ర పాల్గొన్నారు.
వేధింపుల కేసు నమోదు
బనగానపల్లె: భార్యను వేధిస్తున్న భర్తతో పాటు అతని తల్లి, సోదరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నందివర్గం ఎస్‌ఐ వెంకటసుబ్బయ్య తెలిపిన వివరాలు..మండలంలోని నందివర్గం గ్రామానికి చెందిన షేక్ దస్తగిరి కూతురు షేక్ మాబుచాంద్‌ను 8 ఏళ్ల క్రితం ఆళ్లగడ్డ మండ లం చింతకుంట్ల గ్రామానికి చెందిన షేక్ అమీ ర్‌బాషాకు ఇచ్చి వివాహం చేశారు. అప్పట్లో కట్నంగా రూ.2 లక్షల నగదు, ఐదు తులాల బంగారు ఇచ్చారు. కొంతకాలంగా అదనపు కట్నం కోసం భర్తతోపాటు అత్త లతీఫ్‌మున్నీసా, ఆడబిడ్డ రషీదాబీ శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారు. తండ్రి దస్తగిరి పేరు మీద ఉన్న అర ఎకరం పొలం తీసుకురావాలని ఇబ్బందులకు గురి చేస్తుండటంతో బాధితురా లు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
సీసీ కెమెరాలపై
ఉచిత శిక్షణ
డోన్ టౌన్: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఐటీఐలోని స్కిల్ హబ్‌లో ఈ నెల 25 నుంచి సీసీ కెమెరా ఇన్‌స్టాలేషన్ టెక్నిషియన్ కోర్సులో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు స్కిల్ హబ్ కోర్డినేటర్ గోఫినాథ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్, డిగ్రీతోపాటు ఐటీఐలో ఎలక్ట్రీషియన్ కోర్సు చదివి 18 నుంచి 30 ఏళ్ల వయస్సు లోపు ఉన్న వారు అర్హులన్నారు. ఆసక్తి ఉన్న వారు తమ పూర్తి వివరాలతో స్థానిక ఐటీఐలో దరఖాస్తు సమర్పించి పేర్లు నమోదు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు 9542643747 సంప్రదించాలని సూచించారు. కోర్సు పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఉద్యోగవకాశాలు కల్పిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment