క్రీడలతో మానసికోల్లాసం
● క్లస్టర్ యువతరంగ్ పోటీలు
కర్నూలు సిటీ: క్రీడలతో శారీరక దృఢత్వంతోపాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని క్లస్టర్ యూనివర్సిటీ వీసీ ఆచార్య డీవీఆర్ సాయిగోపాల్ తెలిపారు. క్లస్టర్ యువతరంగ్–2024 పేరుతో ప్రభుత్వ పురుషుల డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన క్రీడా పోటీలను రిజిస్ట్రార్ కట్టా వెంకటేశ్వర్లుతో కలిసి ఆయన ప్రారంభించారు. క్లస్టర్ యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ, సిల్వర్‌జూబ్లీ, కేవీఆర్ మహిళా డిగ్రీ కా లేజీల విద్యార్థులు, అధ్యాపకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడలకు సమయం కేటాయించుకోవాలన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ పురుషుల డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ డా.ఇందిరాశాంతి, వ్యాయామ అధ్యాపకులు వై.శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
విజేతలు వీరే..
చదరంగం: పురుషుల విభాగంలో ప్రభుత్వం పురుషుల డిగ్రీ కాలేజీ ప్రథమ, సిల్వర్‌జూబ్లీ డిగ్రీ కాలేజీ ద్వితీయ స్థానంలో నిలిచాయి.
● మహిళలు విభాగంలో కేవీఆర్ మహిళా డిగ్రీ కాలేజీ ప్రథమ, సిల్వర్‌జూబ్లీ డిగ్రీ కాలేజీ ద్వితీయ, ప్రభుత్వ పురుషుల డిగ్రీ కాలేజీ తృతీయ స్థానాలు దక్కించుకున్నాయి.
● మహిళా అధ్యాపకుల విభాగంలో ప్రథమ స్థానం ఎం.పద్మావతి, ద్వితీయ స్థానం పి.స్రవంతి(కేవీఆర్ మహిళా డిగ్రీ కాలేజీ) దక్కించుకున్నారు.
క్రికెట్: పురుషుల విభాగంలో సిల్వర్‌జూబ్లీ డిగ్రీ కాలేజీ విజేతగా నిలిచింది.
● అధ్యాపకుల విభాగంలో సిల్వర్‌జూబ్లీ డిగ్రీ కాలేజీ ప్రథమ, కేవీఆర్ మహిళా డిగ్రీ కాలేజీ ద్వితీయ స్థానంలో నిలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment