దాడిలో గాయపడిన వృద్ధుడి మృతి?
కోసిగి: దాడిలో గాయపడి వారం రోజులుగా చికిత్స పొందుతున్న ఓ వృద్ధుడు కోలుకోలేక మృతిచెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని కడదొడ్డి గ్రామానికి చెందిన మజ్జిగ కృష్ణయ్య(69) కుమారుడు గత నెల ఓ బాలికపై జరిగిన అత్యాయత్నంలో సహకరించాడని పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఈక్రమంలో వారం క్రింతం పరారీలో ఉన్న కుమారుడి ఆచూకీ తెలపాలంలూ కృష్ణయ్యపై బాలిక బంధువులు దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన కృష్ణయ్యను కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యం అందించిన డాక్టర్లు.. పరిస్థితి సీరియస్‌గా ఉందని, వేరే ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. చేసేదేమీ లేక కృష్ణయ్యను కుటుంబ సభ్యులు స్వగ్రామానికి తీసుకొస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. దీంతో దాడిలో గాయపడటంతోనే తన భర్త మృతిచెందాడని బసమ్మ మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్‌ఐ చంద్రమోహన్ గ్రామానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రి తరలించారు. అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు కేసు నమోదు చేసుకున్నామని, రిపోర్టు ఆధారంగా తదుపరి విచారణ ఉంటుందని ఎస్‌ఐ తెలిపారు. మృతినికి ఐదుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
కేసీ కెనాల్‌కు 2,445 క్యూసెక్కులు
కర్నూలు సిటీ: సుంకేసుల బ్యారేజీ నుంచి మంగళవారం కేసీ కెనాల్‌కు 2,445 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. నదిలో నీటి ప్రవాహం రోజు రోజుకు తగ్గిపోతుంది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు బ్యారేజీకి ఎగువ నుంచి 6,940 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, ప్రస్తుతం బ్యారేజీలో 1.2 టీఎంసీల పూర్తి స్థాయి నీటి సామర్థ్యం మేరకు నీరు ఉంది. బ్యారేజీ నుంచి 4,479 క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment