ఉద్యోగ భద్రత కల్పించాలి
కర్నూలు(సెంట్రల్): గ్రామైక్య సంఘాల్లో పని చేసే వీఓఏలకు ఉద్యోగ భద్రత కల్పించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ అంజిబాబు డిమాండ్ చేశారు. బుధవారం వెలుగు వీఓఏ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వాలు మారిన ప్రతి సందర్భంలో యూనిమేటర్లను మార్చేసంస్కృతికి రాజకీయ నాయకులు స్వస్తి పలకాలన్నారు. పనిచేస్తున్న వారిని వేధించి విధుల నుంచి తొలగించే ప్రయత్నం మానుకోవాలని హితవు పలికారు. ఏళ్లుగా పనిచేస్తున్న వారి స్థానంలో కొత్త వారిని నియమించడం ద్వారా అనర్హులకు బాధ్యతలు ఇవ్వాల్సి వస్తుందన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిల్లాలో వందలాది మందిని తొలగించారని, వారందరినీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలన్నారు. లేదంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో గుంటెప్ప, సుంకన్న, వెంకటస్వామి, జయమ్మ, మద్దిలేటి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment