ప్యాపిలి: కర్నూలు జిల్లా కప్పట్రాళ్ల రిజర్వు ఫారెస్ట్‌లో యురేనియం తవ్వకాల విషయం పూర్తిగా సద్దుమణగక ముందే నంద్యాల జిల్లా ప్యాపిలి మండలంలో యురేనియం నిక్షేపాల పరీక్షల అంశం తెరపైకి వచ్చింది. మండలంలోని మూడు గ్రామాల్లో బోర్ డ్రిల్లింగ్‌కు ఏఎండీ (అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ రీసెర్చ్) టెండర్లు ఆహ్వానించినట్లు సమాచారం. మండల పరిధిలోని మామిళ్లపల్లి, రాంపురం, జక్కసానికుంట్ల తదితర గ్రామాల్లో 5 కి.మీ పరిధిలో డ్రిల్లింగ్‌కు టెండర్ ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఒక్కో బోర్ 450 అడుగుల నుంచి 1,350 అడుగుల లోతు వరకు డ్రిల్లింగ్ వేయాలని నిర్ణయం తీసుకుంది. గత నెల 10న టెండర్ ఆహ్వానించి ఈనెల 18 వరకు ఏఎండీ గడువు ఇచ్చింది. ఈ విషయంపై స్థానిక అధికారులను వివరణ కోరగా ఎటువంటి సమాచారం లేదని తెలిపారు. కాగా ఇటీవలే కపట్రాళ్లతో పాటు మరో 15 గ్రామాల్లో యురేనియం తవ్వకాల కోసం 60 బోర్లు వేసే ప్రయత్నాలను స్థానికులు అడ్డుకోగా ప్రభుత్వం కొంత వెనకడుగు వేసిన విషయం విధితమే.
Comments
Please login to add a commentAdd a comment