పేద విద్యార్థులకు ఉపయోగం
మాలాంటి పేద విద్యార్థులకు అంబేడ్కర్ గురుకుల కళాశాల నీట్, ఐఐటీ శిక్షణ కేంద్రం ఎంతో ఉపయోగం. ఇక్కడ ఇంటర్మీడియెట్‌తోపాటు నీట్‌కు శిక్షణ ఇస్తారు. నేను 2016–2018 బ్యాచ్ విద్యార్థిని. 2019లో నీట్‌లో ర్యాంక్ రావడంతో కర్నూలు మెడికల్ కళాశాలలో సీటు వచ్చింది. అధ్యాపకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చదువులతోపాటు క్రమశిక్షణ నేర్పిస్తారు. ప్రస్తుతం ఎంబీబీఎస్ ఇంటర్న్‌షిప్ ప్రోగాం చేస్తున్నా. ఇంకా నాలుగు నెలలు ఉంటే కోర్సు పూర్తవుతుంది.
–శివనాయక్,కర్నూలు మెడికల్‌కళాశాల విద్యార్థి
మొదటి ప్రయత్నంలోనే ఐఐటీ సీటు
మాది పశ్చిమగోదావరి జిల్లా. 2018లో అంబేడ్కర్ గురుకుల కళాశాల ఎంట్రెన్స్ టెస్ట్‌లో ర్యాంక్ రావడంతో చిన్నటేకూరు గురుకుల అకాడమీలో సీటు వచ్చింది. 2018–2020 సంవత్సరంలో చిన్నటేకూరు గురుకుల కళాశాలలో ఇంటర్మీడియెట్‌తోపాటు ఐఐటీ శిక్షణ తీసుకున్నాను. అధ్యాపకుల ప్రోత్సహం, మెలకువలతో 2020లో నిర్వహించిన ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలో ర్యాంకు రావడంతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసిలో ఐఐటీలో ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ సీటు వచ్చింది. ఇక్కడ మూడేళ్ల బీటెక్‌తోపాటు, రెండేళ్ల ఎంటెక్ చదవవచ్చు. ప్రస్తుతం ఎంటెక్ సివిల్ ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నాను. గేట్‌కు సన్నద్ధం అవుతున్నాను. ఆల్ ఇండియా ఇంజినీరింగ్ సర్వీసెస్ సాధిస్తానని నమ్మకం ఉంది.
– పి.ప్రకాష్‌బాబు, పశ్చిమగోదావరి జిల్లా
ఎక్కువసీట్లు సాధించేలా ప్రణాళికలు
జూపాడుబంగ్లా గురుకుల కళాశాల నుంచి చిన్నటే కూరు ఐఐటీ, మెడికల్ అకాడమీ డైరెక్టర్‌గా నూత నంగా బాధ్యతలు చేపట్టాను. ఈ ఏడాది జరగబోయే నీట్, ఐఐటీ ప్రవేశ పరీక్షలో 2023–24 కన్నా ఎక్కువ మంది విద్యార్థులు సీట్లు సాధించేలా అధ్యాపకులతో కలిసి ప్రణాళికలు రూపొందిస్తున్నాం. విద్యార్థులకు పరీక్షలంటే భయం పోయేలా పూర్వ విద్యార్థులతోపాటు ఇతర ప్రముఖులతో మోటివేషన్ క్లాసేస్ చెప్పిస్తాం.
– ఉమా మహేశ్వరప్ప, అకాడమీ డైరెక్టర్
Comments
Please login to add a commentAdd a comment