వైభవంగా ప్రతిష్ఠోత్సవాలు
గోనెగండ్ల: మండల పరిధిలోని పెద్దనేలటూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఈశ్వర దేవాలయంలో గణేశ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శివలింగం, పార్వతిదేవి, బసవేశ్వర, గోపుర కలశం, ధ్వజస్తంభ, నాగదేవతల విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం బుధవారం వైభవంగా జరిగింది. విగ్రహ ప్రతిష్ఠ పూజా కార్యక్రమాన్ని కల్లుహళ్లి సంస్థాన మఠం పీఠాధిపతి చెన్న వీరశివాచార్య మహాస్వాములు, కోటేకల్లు పరమేశ్వరస్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. గోపుర కలశాన్ని గ్రామ పురవీధుల గుండా ఊరేగించి ప్రత్యేక పూజలు చేశారు. గణేశ, నవగ్రహ కలశపూజ, అష్ట దిక్కుల కలశ పూజ, శిలా విగ్రహాల జలాధివాసం, ధాన్యాదివాసం, హోమం నక్షత్ర కలశ పూజ నిర్వహించారు. కార్యక్రమానికి స్థానికులతో పాటు వివిధ పట్టణాలు, గ్రా మాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
కూచిపూడి నృత్య ప్రదర్శన
ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా పార్వతి కళ్యాణం కూచిపూడి నృత్య ప్రదర్శన పోటీలను గ్రామానికి చెందిన జహంగీర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. అనంతరం సీఐ గంగాధర్ కూచిపూడి నృత్యప్రదర్శన చేసిన వారికీ షీల్డ్, బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు శిల్పి శ్రీనివాసులు, బసవరాజు, వీరన్న గౌడ్, వెంకటరాముడు, లింగన్న, కేసారం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment