నల్లమల ఘాట్‌లో రోడ్డు ప్రమాదం
మహానంది: నంద్యాల–గిద్దలూరు నల్లమల ఘాట్‌రోడ్డులో బుధవారం లారీ–కారు ఢీకొన్నాయి. పోలీసులు తెలిపిన వివరాలు.. నంద్యాల నుంచి గిద్దలూరు వైపు నుంచి వెళ్తున్న కారు, కాకినాడ నుంచి గిద్దలూరు మీదుగా వస్తున్న లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో లారీ డ్రైవర్‌కు, కారులో ఉన్న మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో కాసేపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. నంద్యాలకు చెందిన కారు యజమాని పఠాం అస్లాం ఖాన్ ఫిర్యాదు మేరకు అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు చెందిన రాయవరం మండలం చెల్లూరి గ్రామానికి చెందిన డ్రైవర్ కోట సూరిబాబుపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రామ్మోహన్‌రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment