కోలుకోలేక వృద్ధురాలి మృతి
చాగలమర్రి: కాలిన గాయాలతో కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ వృద్ధురాలు కోలుకోలేక బుధవారం మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని నేలంపాడు గ్రామానికి చెందిన గుర్రమ్మ(79) ఈనెల 16న ఇంటి వద్ద దీపాలు వెలిగిస్తుండగా చీరకు నిప్పంటుకుని తీవ్రంగా గాయపడింది. కుటుంబీకులు వెంటనే ఆళ్లగడ్డకు తరలించారు. అక్కడి వైద్యుల సలహా మేరకు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందింది. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
విద్యుదాఘాతంతో
వృద్ధురాలి మృతి
ప్యాపిలి: మండల పరిధిలోని నేరేడుచెర్ల గ్రామ శివారు ప్రాంతంలో బుధవారం విద్యుదాఘాతానికి గురై ఈడిగ నాగరత్నమ్మ (69) మృతి చెందింది. నేరేడుచెర్ల గ్రామానికి చెందిన నాగరత్నమ్మ పశువులను మేపేందుకు అడవికి వెళ్లింది. కొండ ప్రాంతంలో తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి భర్త సుబ్బరాయుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు రాచర్ల పోలీసులు తెలిపారు.
రిటైర్డ్ ఏడీ మృతి
కర్నూలు(అగ్రికల్చర్): పశుసంవర్ధక శాఖ విశ్రాంత సహాయ సంచాలకులు (రిటైర్డ్ ఏడీ) డాక్టర్ మల్లికార్జునయ్య(84) బుధవారం మృతిచెందారు. ఈయన కొంతకాలంగా షుగర్ వ్యాధితో బాధ పడుతూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక మృతిచెందాడు. విషయం తెలుసుకున్న కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ ఆస్పత్రికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. మల్లికార్జునయ్య ఐక్యరాజ్య సమితి స్పాన్షర్డ్ పోగ్రామ్ రిండర్ పెస్ట్ ఎరడికేషన్ స్కీమ్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ఎనిమిది జిల్లాలకు సేవలందించారు. వెటర్నరీ మెడిసిన్ వృత్తికి విశిష్ట సేవలు అందించమే గాకుండా మాస్టర్ ఇన్ వెటరినరీ సర్జరీ చేసిన వారిలో మొదటివారు. ఈయన భార్య సౌభాగ్యలక్ష్మి సిల్వర్‌జుబ్లీ కాలేజీలో ప్రొఫెసర్‌గా పని చేశారు.
Comments
Please login to add a commentAdd a comment