● చేతివాటం ప్రదర్శించిన దొంగలు
ఆత్మకూరు: దొంగలు చేతివాటం ప్రదర్శించారు. కాలినడకున వెళ్తున్న వ్యక్తి దృష్టి మరల్చి అతని జోబులోని సెల్‌ఫోన్‌ను చాకచక్యంగా కొట్టేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. పాత బస్టాండ్ నుంచి గౌడ్ సెంటర్ మీదుగా కొత్త బస్టాండ్‌కు వచ్చే కర్నూలు–గుంటూరు రహదారిపై ఓ వ్యక్తి బైక్‌పై వస్తూ కింద పడుతున్నట్లు యాక్షన్ చేస్తూ బైక్‌ను వదిలేశాడు. అక్కడే కాలినడకన అటుగా వెళ్తున్న మల్లికార్జున అనే వ్యక్తి బండిని పైకి లేపి సాయం చేశాడు. ఈ క్రమంలో మరో వ్యక్తి వచ్చి బండిని పైకి లేపేందుకు సాయపడుతున్నట్లు నటించి మల్లికార్జున జేబులో నుంచి సెల్‌ఫోన్ కొట్టేశాడు. అనంతరం బైక్‌పై నుంచి కిందపడిన వ్యక్తి బైక్ వద్ద సెల్‌ఫోన్ కొట్టిన వ్యక్తి ఇద్దరూ అదే బైక్‌పై నంద్యాల టర్నింగ్ వైపు వెళ్లారు. మల్లికార్జున కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్లిన తర్వాత సెల్‌ఫోన్ జేబులో లేకపోవడంతో చోరీ చేశారని గమనించి కేకలు వేశాడు. అయితే అప్పటికే బైక్‌పై దుండగులు పరారయ్యా రు. రూ.30 వేల విలువైన సెల్‌ఫోన్ కొట్టేశారని బాధితుడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఎస్‌ఐ నారాయణరెడ్డి గౌడ్ సెంటర్‌లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించి జేబులో నుంచి సెల్‌ఫోన్ తీసిన దృశ్యాన్ని గుర్తించారు. అనంతనం పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment