జాతీయ స్థాయి పోటీలకు గురుకుల విద్యార్థిని
పాణ్యం: మండల పరిధిలోని నెరవాడ మెట్ట వద్ద ఉన్న గిరిజన గురుకుల బాలికల కళాశాల విద్యార్థిని బిలావత్ విజయలక్ష్మీబాయి జాతీ య స్థాయి హాకీ పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ కె.రామునాయక్ తెలిపారు. బుధవారం విద్యార్థినిని ఎంఈఓ–2సుబ్రహ్మణ్యం, వైస్ ప్రిన్సిపాల్ సుధాకర్‌రెడ్డి, కోచ్ అశోక్‌రెడ్డి, ఎస్‌జీఎఫ్‌ఐ కార్యదర్శి హర్షవర్ధన్‌లతో కలిసి ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ప్రి న్సిపాల్ మాట్లాడుతూ తమ విద్యార్థిని విజయలక్ష్మీబాయి ఈనెల 16 నుంచి 18 వ తేదీ వరకు కాకినాడలో నిర్వహించిన స్కూల్‌గేమ్స్ ఆఫ్ ఫెడరేషన్ అంతర్ జిల్లా హాకీ పోటీల్లో ప్రతిభ కనబరిచి వచ్చే నెల రాంచీలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు.
హౌస్‌వైరింగ్–ఎలక్ట్రీషియన్‌లో ఉచిత శిక్షణ
కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లా లోని గ్రామీణ ప్రాంత యువకులకు కెనరా బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ హౌస్ వైరింగ్–ఎలక్ట్రీషియన్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ కే.పుష్పక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 45 ఏళ్లలోపు వయస్సు ఉండి చదవడం, రాయడం వచ్చిన వారు అర్హులని, 30 రోజుల శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వసతి కల్పించనున్నామని తెలిపారు. ఆసక్తి ఉన్న యువకులు ఆరు ఫొటోలు, రేషన్‌కార్డు, ఆధార్, బ్యాంకు ఖాతా జిరాక్స్ కాపీలు, విద్యార్హత ధ్రువపత్రాల జిరాక్స్‌తో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరి న్ని వివరాలకు కల్లూరు తహసీల్దారు కార్యాలయం పక్కన కెనరా బ్యాంకు హౌసింగ్ బోర్డు బ్రాంచ్‌లో (మూడవ అంతస్తు) సంప్రదించాలన్నారు. లేదా 63044 91236 నంబరుకు ఫోన్ చేసి సంప్రదించవచ్చని తెలిపారు.
వ్యక్తి ఆత్మహత్య
సి.బెళగల్: మండంలోని చింతమానుపల్లె గ్రామానికి చెందిన తెలుగు వెంకటేష్ (56) పు రుగు మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్‌ఐ తిమ్మారెడ్డి తెలిపిన వివరాలు.. వెంకటేష్ ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నాడు. ఈక్రమంలో మంగళవారం రాత్రి పురుగు మందు తాగాడు. గుర్తించిన కుటుంబ సభ్యులు కర్నూలు ఆసుపత్రికి తరలించగా అక్కడ కోలుకోలేక బుధవారం ఉదయం మృతిచెందాడు. మృతుడి భార్య గిడ్డమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టి నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడికి కుమారుడు, నలుగురు కుమార్తెలు ఉన్నారు.
వివాహితపై అసభ్యకర ప్రవర్తన
● తండ్రీకుమారులపై కేసు నమోదు
మహానంది: ఓ వివాహితపై అసభ్యకరంగా ప్రవర్తించిన తండ్రి, మారణాయుధాలతో దాడికి యత్నించిన కుమారుడిపై బుధవారం రాత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ రామ్మోహన్‌రెడ్డి తెలిపిన వివరాలు.. ఎం.తిమ్మాపురం గ్రామానికి చెందిన ఓ మహిళను వ్యవసాయ కూలీ పనుల నిమిత్తం పిలిచేందుకు వెళ్లిన ఓ వ్యక్తి పనికి పిలిచే క్రమంలో ఆమైపె అసభ్యకరంగా ప్రవర్తించడంతో మహిళ కేకలు వేసింది. రెండ్రోజుల క్రితం జరిగిన ఈ ఘటనలో తండ్రికి మద్దతుగా కుమారుడు మారణాయుధాలతో వివాహిత కుటుంబంపై దాడికి యత్నించాడు. ఇదే ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment