గురుకులం మురిసి!
ఆణిముత్యాలు మెరిసి..
● కార్పొరేట్‌కు దీటుగా గురుకుల అకాడమీ శిక్షణ ● ఈ ఏడాది 41 మందికి ఐఐటీ, 20 మందికి నీట్ ర్యాంకులు ● అధ్యాపకుల కృషితో మంచి ఫలితాలు
అధ్యాపకుల కృషి.. విద్యార్థుల పట్టుదలతో చిన్నటేకూరు గురుకుల కళాశాల అద్భుత ఫలితాలు సాధిస్తోంది. షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ అక్కర్లేకుండానే అత్యున్నత ఐఐటీ, మెడికల్ సీట్లు కై వసం చేసుకుంటోంది. కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా అధ్యాపకులు అందిస్తున్న బోధనను ఒడిసి పట్టుకుని విద్యార్థులు ర్యాంక్‌లతో మెరుస్తూ.. గురుకులాన్ని మురిపిస్తున్నారు.
కల్లూరు: రాష్ట్ర విభజనానంతరం పేద విద్యార్థులను డాక్టర్లుగా, ఇంజినీర్లుగా తీర్చదిద్దాలనే ఉద్దేశంతో కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల ప్రాంగణంలో ఐఐటీ, మెడికల్ అంబేడ్కర్ గురుకుల అకాడమీని 2016లో ఏర్పాటు చేశారు. 2016–2017 నుంచి 2023–24 అకాడమిక్ ఇయర్స్‌లో ఇప్పటి వరకు ఎనిమిది బ్యాచ్‌లకు చెందిన విద్యార్థులకు ఐఐటీ, నీట్‌లో శిక్షణ ఇచ్చారు. వారిలో ఇంజినీరింగ్ విభాగంలో దేశంలోని వివిధ ఐఐటీ/ఎన్‌ఐటీలకు 202 మంది ఎంపికయ్యారు. అందులో కొందరు కోర్సులను పూర్తి చేసుకొని పలు కంపెనీలలో ఉద్యోగం చేస్తూ ఏడాదికి రూ.10 లక్షల వరకు ప్యాకేజీ పొందుతున్నారు. బైపీసీ విభాగంలో నీట్‌లో మంచి ర్యాంకులు సాధించి మెడిసిన్, బీడీఎస్, ఏజీ బీఎస్సీ/బీవీఎస్ కోర్సులకు 119 మంది విద్యార్థులు ఎంపికయ్యారు.
సంవత్సరం ఐఐటీ/ ఎంబీబీఎస్/బీడీఎస్ / మొత్తం
ఎన్‌ఐటీ/ఐఐటీ ఏజీబీఎస్సీ
2016–2017 5 3 08
2017–2018 10 12 22
2018–2019 16 26 42
2019–2020 31 20 51
2020–2021 34 16 50
2021–2022 34 13 47
2022–2023 31 20 51
2023–2024 41 24 65
మొత్తం 202 119 321
అధ్యాపకుల కృషి
అకాడమీలో డైరెక్టర్ విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని తరగతులు నిర్వహిస్తుండడంతో మంచి ర్యాంకులు సాధిస్తున్నారు. సబ్జెక్టు లెక్చరర్లు విద్యా ర్థులను సొంత పిల్లల్లా భావించి బోధన చేస్తున్నారు. మూసధోరణిలో కాకుండా ప్రతి పదాన్ని అర్థవంతంగా బోధిస్తుండటంతోపాటు ఉదయం, సాయంత్రం స్టడీ అవర్స్‌లో అనుమానలు నివృత్తి చేస్తున్నారు. చాప్టర్ వైజ్‌గా పరీక్షలు పెడుతూ పరీక్షలంటే భయం పోగొడుతున్నారు. ప్రశ్నపత్రాలపై నా ప్రత్యేక తరగతులు నిర్వహించి జవాబు రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. యోగా, క్రీడల్లోనూ శిక్ష ణ ఇస్తూ ప్రోత్సహిస్తుండటంతో పలువురు విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయికి ఎంపికయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment