కేరింత.. తుల్లింత
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం కలర్‌ఫుల్‌గా మారింది. పీజీ విద్యార్థులు కేరింతలు కొండుతూ హుషారుగా గడిపారు. మాస్ దంచుడు.. క్లాస్ స్టెప్పులతో అదరగొట్టారు. డిపార్ట్‌మెంట్ల వారీగా కల్చరల్ పోగ్రామ్స్‌లో పాల్గొంటూ జోష్ నింపారు. వర్సిటీలో శుక్రవారం పీజీ మొదటి సంవత్సరం విద్యార్థులకు స్వాగతం పలుకుతూ ఫ్రెషర్స్ డే వేడుకలను సీనియర్స్ ఘనంగా నిర్వహించారు. వర్సిటీ వైస్‌ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎన్‌టీకే నాయక్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు సందేశమిచ్చారు. క్రమశిక్షణతో మెలుగుతూ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు. రిజిస్ట్రార్ డాక్టర్ బి.విజయకుమార్ నాయుడు, వర్సిటీ సైన్స్, ఆర్ట్స్ కళాశాలల ప్రిన్సిపాళ్లు ఆచార్య సీవీ కృష్ణారెడ్డి, ఆచార్య ఎన్.నరసింహులు, అకడమిక్ అఫైర్స్ డీన్ ఆచార్య భరత్‌కుమార్ మాట్లాడారు. అనంతరం వివిధ క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి అతిథులు బహుమతులను అందజేశారు. విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు జోష్ నింపాయి. ఎన్‌ఎస్‌ఎస్ కో–ఆర్డినేటర్ డాక్టర్ ఎం.నారగాజు, ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ కో–ఆర్డినేటర్ డాక్టర్ శివకిషోర్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment