క్లస్టర్ వర్సిటీలో నేడు యువతరంగ్
కర్నూలు (సిటీ): క్లస్టర్ వర్సిటీలో శనివారం యువతరం కార్యక్రమం నిర్వహించనున్నట్లు వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ డీవీఆర్ సాయిగోపాల్ తెలిపారు. శుక్రవారం వర్సిటీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలోనే మొదటి ఏకై క క్లస్టర్ యూనివర్సిటీ కర్నూలులోనే ఏర్పాటైందన్నారు. వర్సిటీ పరిధిలో ఉన్న సిల్వర్‌జూబ్లీ, ప్రభుత్వ పురుషుల డిగ్రీ కాలేజ్, కేవీఆర్ మహిళా డిగ్రీ కళాశాలల్లోని పీజీ కోర్సులను 2024–25 విద్యా ఏడాది నుంచి వర్సిటీ క్యాంపస్ నుంచి తరగతులు నిర్వహించనున్నట్లు చెప్పారు. జిల్లాలోని పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా కొత్తగా ఏడు కోర్సులను ప్రారంభించనున్నామన్నారు. ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్ కోసం క్లస్టర్ యూనివర్సిటీని తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వర్సిటీలో బోధన, బోధనేతర సిబ్బంది నియామకానికి ప్రతిపాదనలు పంపగా ప్రభుత్వం అంగీకారం తెలిపిందన్నారు. ఆర్థిక శాఖ నుంచి ఆమోదం వచ్చిన వెంటనే భర్తీకి చర్యలు తీసుకుంటామన్నారు. యువ తరంగ్ కార్యక్రమానికి సినీ నటుడు సుమన్‌తోపాటు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ హాజరవుతారన్నారు. సమావేశంలో రిజిస్ట్రార్ కె.వెంకటేశ్వర్లు, అధ్యాపకులు పార్వతి, వింధ్య వాసిని పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment