దాత తీరుపై పండితుల ఆవేదన
మహానంది: మహానంది దేవస్థానం అన్నప్రసాద పథకానికి కూరగాయలు అందించే దాత టి.ప్రసాద్ తీరుపై ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి, వేద పండితులు ఆవేదన వ్యక్తం చేశారు. వారు శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కార్తీకమాసం, పౌర్ణమి రోజున నిర్వహించిన కోటి దీపోత్సవం, జ్వాలాతోరణం కార్యక్రమాలకు టి.ప్రసాద్ హాజరై తనకు మర్యాదలు చేయలేదంటూ దుర్భాషలాడుతూ వేద పండితులు హనుమంతుశర్మపై చెయ్యి చేసుకున్నారని వాపోయారు. ఆలయంలో అన్నప్రసాద పథకానికి కొన్నేళ్ల నుంచి కూరగాయలు అందిస్తున్నారన్న కారణం, ఆలయ ప్రతిష్టకు భంగం కలగరాదనే ఉద్దేశంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయలేదని చెప్పారు. ఆయనే దుర్భాషలాడి చెయ్యి చేసుకుని, కమిషనర్‌కు ఫిర్యాదు చేయడం బాధాకరమన్నారు. ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. గత శనివారం నుంచి టి.ప్రసాద్ కూరగాయలు పంపడం లేదని, ఆయన పేరుతో ఉన్న బోర్డులను తొలగించాలని చెప్పారన్నారు. ఈ క్రమంలో అన్నప్రసాద పథకానికి కూరగాయలు అందించేందుకు బుక్కాపురం గ్రామానికి చెందిన కిషోర్, ఇండస్ ఆస్పత్రి వైద్యులు శ్రీనివాస్, తాడిపత్రికి చెందిన మల్లికార్జున, హైదరాబాద్‌కు చెందిన మరో ఇద్దరు దాతలు ముందుకొచ్చారని చెప్పారు. ఏఈఓ మధు, ఆలయ పర్యవేక్షకులు అంబటి శశిధర్‌రెడ్డి, ఉప ప్రధాన అర్చకులు వనిపెంట జనార్దనశర్మ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment