కర్నూలు(అగ్రికల్చర్): ఈ నెల 28న కడపలో ఉద్యాన శాఖ ప్రాంతీయ సదస్సు జరుగుతుందని జిల్లా ఉద్యాన శాఖ అధికారి పి.రామాంజనేమయులు శనివారం తెలిపారు. ఈ సదస్సుకు జిల్లా నుంచి ఉద్యాన శాఖ అధికారులతో పాటు ఏపీఎంఐపీ అధికారులు హాజరుకానున్నారన్నారు. ఆయిల్‌పామ్ సాగుతో పాటు ఎంఐడీహెచ్, ఆర్కేవీవై నిధుల వినియోగం, ఉద్యాన ఉత్పత్తుల కలెక్షన్ సెంటర్లు, రూరల్ మార్కెట్ల అభివృద్ధ్ది తదితర వాటిపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించనున్నారని తెలిపారు. అదే విధంగా సూక్ష్మ సేద్యం విస్తరణపై కూడా సమీక్ష నిర్వహించనున్నారని చెప్పారు.
రేపు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
కర్నూలు(సెంట్రల్): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ పి.రంజిత్‌బాషా శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజలు వినతులు అందజేయాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment