కార్డు లేదు.. రేషన్‌ రాదు! | - | Sakshi
Sakshi News home page

కార్డు లేదు.. రేషన్‌ రాదు!

Published Sun, Nov 24 2024 5:28 PM | Last Updated on Sun, Nov 24 2024 5:28 PM

కార్డ

కార్డు లేదు.. రేషన్‌ రాదు!

దరఖాస్తులు తీసుకోవడం లేదు

రేషన్‌కార్డుల మంజూరు కోసం ఎలాంటి దరఖాస్తులు స్వీకరించడం లేదు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు లేవు. ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పలేము. ప్రభుత్వం ఆదేశిస్తే తక్షణమే కార్డులు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. మార్పులు, చేర్పులకు కూడా సైట్‌ ఓపెన్‌ కావడం లేదు.

– రాజారఘువీర్‌, డీఎస్‌ఓ, కర్నూలు

నా కొడుకును యాడ్‌ చేసుకోవాలి

కొడుకును కార్డులో యాడ్‌ చేసుకోవడానికి సైట్‌ ఓపెన్‌ కావడం లేదని సచివాలయ సిబ్బంది చెబుతున్నారు. జూలై యాడ్‌ అవుతుందని చెప్పారు. అయితే కూటమి ప్రభుత్వం రావడంతో అది ఆగిపోయింది. ఎవరినీ అడిగినా సరైనా సమాధానం చెప్పడం లేదు. – వారం తిమ్మప్ప,

తుమ్మిగనూరు, కోసిగి మండలం

కర్నూలు(సెంట్రల్‌): కూటమి ప్రభుత్వం పేద, మధ్యతరగతి వర్గాల ప్రజల సంక్షేమాన్ని విస్మరించడంతో ఆయా వర్గాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. సంక్షేమ పథకాల కొత్త లబ్ధిదారుల ఎంపిక కు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి వేసారిపోతున్నారు. ఈ ప్రభుత్వం ఏర్పాటై ఆరు నెలలు గడుస్తున్నా ఒక్క రేషన్‌కార్డు మంజూరు చేయలేదు. దీంతో కొత్త రేషన్‌ కార్డులు, పాత కార్డుల్లో మార్పులు, చేర్పుల కోసం ప్రజలు నిరీక్షిస్తున్నారు. అయితే కొత్త కార్డులు ఎప్పుడు వస్తాయో.. ఎప్పుడు ఇస్తారో.. ఎప్పుడు మార్పులు, చేర్పులు చేసుకోవాలో ప్రజలకు చెప్పలేక అధికారులు సైతం తలలు పట్టుకుంటున్నారు. ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో కర్నూలు జిల్లాలో 7.50 లక్షల కుటుంబాలు ఉన్నట్లు తేలాయి. ఇదే సమయంలో జిల్లాలో ఉన్న 1,233 ఎఫ్‌పీ షాపుల పరిధిలో 6,72,209 రేషన్‌కార్డుదారులు ఉన్నారు. ఈ క్రమంలో కొత్త రేషన్‌కార్డుదారుల ఆవశ్యకత ఉంది. అంతేకాక ప్రస్తుతం ఉన్న కుటుంబాల్లో వివాహం అయిన వారికి కూడా కొత్త రేషన్‌కార్డులను ఇవ్వాల్సి ఉంది. ఏదైనా సంక్షేమ పథకం వర్తించాలంటే రేషన్‌కార్డే మూలాధారం. ఆ కార్డు ఉంటేనే వారికి సంక్షేమ ఫలాలు వర్తిస్తాయి. ఇటీవల దీపం–2 పథకం అమలునకు రాష్ట్ర ప్రభుత్వం రేషన్‌కార్డునే ఆధారంగా చేసుకొని అర్హతను నిర్ణయించింది. ఈ క్రమంలో కొత్త రేషన్‌కార్డుల కోసం ప్రజలు కాళ్లేరిగేలా తిరుగుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు అవుతున్నా ఒక్క కార్డును మంజూరు చేయలేదు. పైగా కార్డుల్లో కుటుంబాల విభజన, కార్డులో సభ్యుల యాడింగ్‌, డిలిటింగ్‌, కరెక్షన్‌ ఆఫ్‌ ఆధార్‌ కార్డుల విభజనకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదు. దీంతో సచివాలయాల్లో రేషన్‌ కార్డుల మంజూరు, ఇతర అంశాలపై తమకేమీ తెలియదని, ఎలాంటి దరఖాస్తులు తీసుకోమని ఖరాకండిగా చెప్పేస్తున్నారు.

వైఎస్సార్‌సీపీ హయాంలో లక్షకు పైగా కొత్త కార్డులు

వైఎస్సార్‌సీపీ ఐదేళ్ల పాలన సంక్షేమానికి స్వర్ణయుగం. గత ఐదేళ్లలో ఏకంగా లక్షకు పైగా కొత్త రేషన్‌కార్డులను మంజూరు చేశారు. సచివాలయాలు వచ్చిన మొదట్లో రేషన్‌కార్డు లేని వారు దరఖాస్తు చేసిన రోజునే మంజూరు చేసి అందజేశారు. అలాగే లబ్ధిదారుల సంఖ్య తగ్గేకొద్ది నెల రోజులకు కొన్నాళ్లు కార్డులు మంజూరు చేశారు. తరువాత ఆరు నెలలకు ఒక్కసారి కార్డులను ఇస్తూ వస్తున్నారు. ఏడా డిసెంబర్‌, జూలై మాసాల్లో కొత్త కార్డులు, రేషన్‌ కార్డుల్లో మార్పులు, చేర్పులకు అవకాశం ఉండేది. ఈ క్రమంలో గత డిసెంబర్‌లో జిల్లాకు 8,845 కార్డులు చివరగా మంజూరయ్యాయి. తరువాత జూలైలో కొత్తకార్డులు ఇవ్వాల్సి ఉండగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ సైట్‌ను మూసి వేశారు. దీంతో కొత్త కార్డులు ఒక్కటి కూడా ఆరు నెలల కూటమి ప్రభుత్వంలో మంజూరు కాలేదు. అంటే దాదాపు సంవత్సరం కాలాంగా కొత్తకార్డులు లేక పేదలు అవస్థలు పడుతున్నారు. అదే సమయంలో మార్పులు, చేర్పులకు అవకాశం లేకపోవడంతో వేలాది మంది కొత్త కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు.

తెలియదు.. ఏమో..?

కొత్త రేషన్‌ కార్డులు ఇవ్వని

కూటమి ప్రభుత్వం

మార్పులు, చేర్పులు కూడా

చేయని వైనం

ఆరునెలలు గడుస్తున్నా అతీగతి లేదు

సచివాలయాల చుట్టూ

పేదల ప్రదక్షిణలు

రేషన్‌కార్డుల మంజూరు, మార్పులు, చేర్పుల కోసం ఎవరినీ అడిగినా సరైనా సమాధానం రావడం లేదు. తెలియదు.. ఏమోనంటూ దాటవేస్తున్నారు. సచివాలయాల్లో అడిగితే తమకు ఎలాంటి ఆదేశాలు లేవని, జిల్లా పౌరసరఫరాల అధికారులను అడిగాలని సూచిస్తున్నారు. అక్కడికెళ్తే తమకేమి ప్రభుత్వం నుంచి ఆదేశాలు లేవని, వచ్చిన సమయంలో తెలియజేస్తామని వారు చెబుతున్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు కూడా రేషన్‌ కార్డుల మంజూరు కోసం అర్జీలు వస్తున్నా వాటిని ఉన్నతాధికారులు బుట్టదాఖలు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
కార్డు లేదు.. రేషన్‌ రాదు!1
1/2

కార్డు లేదు.. రేషన్‌ రాదు!

కార్డు లేదు.. రేషన్‌ రాదు!2
2/2

కార్డు లేదు.. రేషన్‌ రాదు!

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement