చిరుధాన్యాల ఆహారంతో ఆరోగ్యం
కర్నూలు(అగ్రికల్చర్): వారంలో ఆరు రోజులు చిరుధాన్యాల ఆహారం తీసుకుంటే షుగర్, బీపీలు దరి చేరవని ఆరోగ్యంగా ఉండొచ్చని మదనపల్లి ప్రకృతివనం ప్రసాద్ తెలిపారు. మంగళవారం కర్నూలుకు వచ్చిన ఈయన కలెక్టరేట్ ప్రాంగణంలోని మిల్లెట్ కేఫ్‌ను సందర్శించారు. లభిస్తున్న ఆదరణను పరిశీలించి మిల్లెట్‌ను ఆహారంగా తీసుకుంటున్న వారితో ముచ్చటించారు. అనంతరం ఆయన చిరుధాన్యాలను ఆహారంగా తీసుకోవడం వల్ల కలిగే ఉపయోగాలను వివరించారు. సరిగ్గా 50 ఏళ్లకు ముందు 95 శాతం మంది చిరుధాన్యాలనే ఆహారంగా తీసుకునేవారని, దాంతో వారు ఎంతో ఆరోగ్యంగా ఉండేవారన్నారు. ఇప్పుడు వరి ధాన్యం ఆహారం తీసుకోవడం ఎక్కువ కావడంతో ప్రజలు తీవ్ర అనారోగ్యాల బారిన పడుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మిల్లెట్ కేఫ్ యజమాని వేణుబాబు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment