కర్నూలులో ప్రీమియం లిక్కర్ స్టోర్
● నోటిఫికేషన్ విడుదల చేసిన ఎకై ్సజ్ సూపరింటెండెంట్
కర్నూలు: కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రీమియం లిక్కర్ స్టోర్ ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ కలెక్టర్ అనుమతితో జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ సుధీర్ బాబు మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. నూతన మద్యం పాలసీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 12 ప్రీమియం లిక్కర్ స్టోర్లను ప్రభుత్వం మంజూరు చేయగా ఇందులో భాగంగా కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఒక ప్రీమియం లిక్కర్ స్టోర్ ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ అయింది. ప్రీమియం లిక్కర్ స్టోర్ లైసెన్స్ కాల వ్యవధి ఐదేళ్లు. రిటైల్ ఎకై ్సజ్ ట్యాక్స్ మొదటి సంవత్సరం లైసెన్స్‌దారులు చెల్లించాల్సిన వార్షిక పన్ను రూ.కోటి, రెండవ సంవత్సరం నుంచి 10 శాతం పెరుగుదల ఉంటుంది. స్టోర్‌లో మద్యం, సిగరెట్లు సేవించడానికి అనుమతి ఉండదు. అలాగే శీతల పానీయాలను విక్రయించరాదు. స్టోర్‌లో వివిధ బ్రాండ్లను ప్రదర్శించడానికి ప్రత్యేకమైన అల్మారాలతో షాపింగ్ షాప్ కాన్సెప్ట్‌ను కలిగి ఉండాలి. కొనుగోలుదారులు ఉత్పత్తులను (మద్యం బాటిళ్లు) ప్రత్యేక డిస్‌ప్లే కల్పించాలి. ప్రీమియం ఫ్లోర్ దరఖాస్తుకై https:// apsbolap. gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకునే సదుపాయం ఉంది. దరఖాస్తు రుసుము రూ.15 లక్షలు డిమాండ్ డ్రాఫ్ట్ తీయాలి. ఎక్కువ డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాల్సిన కారణంగా ఆఫ్‌లైన్ విధానం అమలు చేస్తున్నట్లు ఈఎస్ తెలిపారు. ఈ నెల 31వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ జిల్లా అధికారి కార్యాలయంలో దరఖాస్తు సమర్పించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment