వరిగడ్డి ట్రాక్టర్‌ను ఢీకొన్న కారు
కోడుమూరు రూరల్: వరిగడ్డి లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్‌ను ప్రమాదవశాత్తు ఓ కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు గాయపడిన సంఘటన రాత్రి కోడుమూరు –ఎమ్మిగనూరు రోడ్డులో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. ఇద్దరు మహిళా ఉద్యోగులు ఆదివారం సెలవు నేపథ్యంలో ఆదోని నుంచి కారులో కర్నూలుకు బయబయలు దేరారు. అయితే మార్గమధ్యంలో కోడుమూరు సమీపాన ముందు వరిగడ్డి లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్‌ను ప్రమాదశాత్తూ కారు ఢీకొంది కారులోని ఏయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో డ్రైవర్‌తో పాటు, ఇద్దరు మహిళా ఉద్యోగులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం కర్నూలుకు తీసుకెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment