ప్రశాంతంగా డిపార్టుమెంటల్ పరీక్షలు
కర్నూల(సెంట్రల్): డిపార్టుమెంటల్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఆదివారం సనత్ నగర్ డిజిటల్ అయాన్‌లో జరిగిన పరీక్షా కేంద్రాన్ని డీఆర్వో సి.వెంకట నారాయణమ్మ పరిశీలించారు. ఎలాంటి అలసత్వం లేకుండా పరీక్షలను నిబంధనల మేరకు పకడ్బందీగా నిర్వహించాలని నిర్వాహకులకు ఆదేశాలు ఇచ్చారు.
నేడు కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
కర్నూలు(సెంట్రల్): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ పి.రంజిత్‌బాషా ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజలు వినతులు అందజేయాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్‌తోపాటు అన్ని మండల, డివిజనల్, మునిసిపల్ కార్యాలయాల్లో నిర్వహిస్తున్నామని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
కొత్త స్కూళ్లకు దరఖాస్తు చేసుకోండి
కర్నూలు సిటీ: జిల్లాలో 2025–26 విద్యా సంవత్సరానికి కొత్తగా స్కూళ్ల ఏర్పాటు, పాఠశాలల అప్‌గ్రడేషన్‌కు ప్రైవేట్ యాజమాన్యాల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ ఎస్.శ్యామూల్ పాల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 31వ తేదీలోపు ఆన్‌లైన్‌లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుందన్నారు. వచ్చే ఏడాది జన వరి 26 లోపు కొత్త స్కూళ్లకు అనుమతులు ఇస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలలు ఏదైనా తరగతి అప్‌గ్రడేషన్ చేయడానికి కూడా ఈ నెల 31వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించాలన్నారు.
సమగ్ర శిక్ష ఏపీసీగా శ్రీనివాసులు
కర్నూలు సిటీ: సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కో–ఆర్డినేటర్‌గా టి.శ్రీనివాసులును నియమిస్తూ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. రెగ్యులర్ ఏపీసీ లేకపోవడంతో ఇప్పటివరకు డీఈఓనే ఇన్‌చార్జ్ బాధ్యతలు నిర్వహించారు. నూతనంగా ఏపీసీగా నియమితులైన టి.శ్రీనివాసులు విజయవాడలోని ఏపీ మారిటైం బోర్డు డిప్యూటీ కలెక్టర్‌గా పని చేస్తున్నారు. జనవరి 1న ఇక్కడ ఏపీసీగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.
నల్లమలలో ట్రాఫిక్ జామ్
మహానంది: నల్లమల ఘాట్ రోడ్డులో ఆదివారం ట్రాఫిక్ జాం అయింది. నంద్యాల నుంచి గిద్దలూరు వైపు వెళ్తున్న ఓ లారీకి యాక్సిల్ కట్ అవడంతో నిలిచిపోయింది. అదే సమయంలో అధిక లోడ్‌తో వెళ్తున్న మరో లారీ పురాతన వంతెన సమీపంలో మలుపు వద్ద వెళ్లలేక ఆగిపోయింది. దీంతో సుమారు మూడున్నర గంటల పాటు ట్రాఫిక్ జాం కావడంతో ఇరువైపులా వందల సంఖ్యలో పెద్ద పెద్ద వాహనాలు ఆగిపోయా యి. విషయం తెలుసుకున్న గిద్దలూరు, మహా నంది పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మరమ్మతులకు గురైన లారీని పక్కకు తప్పించడంతో వాహనాల రాకపోకలు యథావిధిగా సాగాయి.
Comments
Please login to add a commentAdd a comment