No Headline
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎక్కడ చూసినా క్రిస్మస్ సందడి కనిపిస్తోంది. ఈనెల 25న కరుణామయుడు ఏసుక్రీస్తు పుట్టినరోజు సందర్భంగా పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించుకునేందుకు క్రైస్తవులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే ఇళ్లను, చర్చీలను విద్యుద్దీపాలు, రంగురంగుల బెలూన్లతో ప్రత్యేకంగా అలంకరించారు. క్రీస్తు జనన ఇతి వృత్తాన్ని వివరించే బొమ్మలు, క్రిస్మస్ ట్రీలు, స్టార్లు ఏర్పాటు చేస్తున్నారు. కర్నూలు, నంద్యాలతో పాటు ముఖ్యమైన పట్టణాల్లో వాటి విక్రయాలు జోరందుకున్నాయి. క్రిస్మస్‌ను పురస్కరించుకుని పేద, ధనిక తేడా లేకుండా అందరూ ఒకే చోట చేరి యేసు పుట్టుకను స్మరించుకుంటూ ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నట్లు రాక్‌వుడ్ చర్చి పాస్టర్ కిషోర్‌కుమార్ తెలిపారు.
– కర్నూలు కల్చరల్
క్రిస్మస్ కాంతులు
Comments
Please login to add a commentAdd a comment