గుంతలను తప్పించబోయి..
● అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు
● 50 మంది ప్రయాణికులకు తప్పిన ప్రమాదం
హొళగుంద: ఆదోని నుంచి హొళగుందకు వస్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పొలంలోకి దూసుకెళ్లింది. ఆదోని డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హొళగుంద మీదుగా ఎల్లార్తికి వెళ్లేందుకు ఆదివారం మధ్యాహ్నం ఆదోని నుంచి బయలుదేరింది. హొళగుంద కిలోమీటర్ దూరం ఉండగా ఈరన్న బావి సమీపంలో రోడ్డు అధ్వానంగా ఉండడంతో డ్రైవర్ గుంతలను తప్పించ బోయే ప్రయత్నంలో బస్సు అదుపు తప్పి పక్కనున్న పొలంలోకి దూసుకెళ్లింది. వెంటనే డ్రైవర్ బస్సును నిలిపి వేయడంతో రోడ్డు పక్కనే కొద్దిగా ఒరిగి నిలిచిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 50 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉండగా.. జేసీబీతో బస్సును బయటకు లాగేందుకు అయ్యే ఖర్చును డ్రైవరే భరించాల్సి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment