పాలకులు చిత్తశుద్ధితో ఆలోచిస్తే జిల్లా సస్యశ్యామలమే
జిల్లాను వ్యవసాయ పరంగా అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కానీ ఇందుకు అనుగుణంగా కార్యాచరణ లేక పోవడంతో వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. వేదవతి నదిపై ప్రాజెక్టు నిర్మిస్తే కరువు ప్రాంతానికి సాగునీటి సమస్య ఉండదు. తుంగభద్ర నదిపై గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మించి రైతులకు రెండు, మూడు పంటలు పండించుకునే అవకాశం కల్పిస్తే జిల్లా నుంచి వలసలు ఉండవు. పాలకులు చిత్తశుద్ధితో ఆలోచించి సాగునీటిని అందిస్తే జిల్లా సస్యశ్యామలమవుతుంది.
– ఎం.రామకృష్ణారెడ్డి,
రాష్ట్ర అధ్యక్షుడు, ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక
చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ప్రోత్సహించాలి
జిల్లాలో చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాపనకు అవకాశాలు ఉన్నాయి. టమాట విస్తారంగా పండుతుంది. దీని ఆధారంగా పరిశ్రమలు ఏర్పాటు చేయవచ్చు. చిరుధాన్యాలు పండుతున్నాయి. వీటికి సంబంధించిన పరిశ్రమలకు అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. దీనికి డ్రిప్ సదుపాయం కల్పించాల్సి ఉంది. రాయితీలు ఇచ్చి ప్రోత్సహించాలి. దీంతో స్థూల ఉత్పత్తి కూడా పెరుగుతుంది. రైతులకు చేతి నిండా పనులు కల్పిస్తే వలసలు తగ్గిపోతాయి.
– జైపాల్‌రెడ్డి, రిటైర్డ్ జెడ్పీ సీఈఓ
సాగు నీటిపై
దృష్టి సారించాలి
పశ్చిమ ప్రాంతంలో భూగర్భ జలాలు కూడా అట్టడుగున ఉన్నాయి. వర్షాకాలంలో చాలా వరకు నీరు వృథాగా నదుల్లో కలుస్తోంది. ఈ నీటిని భూమిలోకి ఇంకింపజేస్తే భూగర్భ జలాలు పెరుగుతాయి. ప్రభుత్వాలు రాయితీలపై రైతులకు బోర్లు వేయించాలి. జిల్లాలో వివిధ మండలాల మీదుగా తుంగభద్ర నది ప్రవహిస్తున్నా.. సాగు నీటి సదుపాయం లేకపోవడం దురదృష్టకరమే. వేదవతి, గుండ్రేవుల ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడంపై పాలకులు దృష్టి సారించాలి.
– తిరుపతిరెడ్డి, చైర్మన్,
అపార్డు స్వచ్ఛంద సంస్థ, కర్నూలు
Comments
Please login to add a commentAdd a comment