● 30వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ
● రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
అభ్యర్థుల ఎంపిక
కర్నూలు(సెంట్రల్): జిల్లాలో 201 డీలర్ పోస్టులను శాశ్వత ప్రాతిపాదికన భర్తీ చేసేందుకు కలెక్టర్ పి.రంజిత్‌బాషా నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఇందులో కర్నూలు డివిజన్‌లో 76, ఆదోని డివిజన్‌లో 80, పత్తికొండ డివిజన్‌లో 45 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులను రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు పూరించిన అర్జీలను డిసెంబర్ 23 నుంచి డిసెంబర్ 30వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు నేరుగా, లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారులకు పంపాలి. ఇంటర్మీడియెట్ పాసై ఉండి 18–40 ఏళ్ల మధ్య యువతీ, యువకులు అర్హులు. డీలర్ పోస్టు ఖాళీగా ఉన్న గ్రామ పంచాయతీలో పరిధిలోని వారు మాత్రమే అర్హులు. దరఖాస్తు, ఇతర పూర్తి వివరాల కోసం సంబంధిత మండలాల తహసీల్దార్లు లేదా ఆర్‌డీఓ కార్యాలయాలను సందర్శించి తెలుసుకోవచ్చని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment