శ్రీశైలం టెంపుల్: దేవదాయశాఖ నిబంధనలను అనుసరించి శ్రీశైల క్షేత్ర పరిధిలో అన్యమత ప్రచారం, అన్యమతాలకు సంబంధించిన కార్యకలాపాలు, అన్యమత చిహ్నాలు ప్రదర్శనను పూర్తిగా నిషేధించినట్లు శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం శ్రీశైలం ఈఓ మాట్లాడుతూ అన్యమత సూక్తులను, చిహ్నాలను, బోధనలను, అన్యమతానికి సంబంధించిన ఫొటోలు కలిగి ఉన్న వాహనా లు కూడా క్షేత్ర పరిధిలోకి అనుమతించబడవని పేర్కొన్నారు. శ్రీశైల క్షేత్ర పరిధిలో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ అన్యమత ప్రచారాలకు, కార్యక్రమాలకు సహకరించడం కూడా చట్టం ప్రకారం శిక్షార్హమే అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment