ఏడాదిలో ఒకటి కంటే ఎక్కువ పంటలు సాగు వివరాలు మండలాల వారీగా.. | - | Sakshi
Sakshi News home page

ఏడాదిలో ఒకటి కంటే ఎక్కువ పంటలు సాగు వివరాలు మండలాల వారీగా..

Published Mon, Dec 23 2024 1:45 AM | Last Updated on Mon, Dec 23 2024 1:44 AM

 ఏడాద

ఏడాదిలో ఒకటి కంటే ఎక్కువ పంటలు సాగు వివరాలు మండలాల వా

బంగారు పంటలు పండే భూములు ఉన్నాయి. గలగలమంటూ ప్రవహించే తుంగభద్రమ్మ చెంతనే ఉంది. అయినా భూములు తడవవు.. వలసలు తప్పవు అన్నట్లుగా ఉంది జిల్లాలో రైతుల పరిస్థితి. వాన దేవుడు కరుణిస్తే కాసిన్నీ తిండి గింజలు.. లేదంటే అప్పులు. ఒక కారు పంటతో వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదు. ఏళ్ల తరబడి ఇదే సమస్య నెలకొంది. వైఎస్సార్‌సీపీ హయాంలో ‘అడా’ ఏర్పాటు చేసి వలసలకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం జరిగింది. ప్రభుత్వం

మారడంతో ఆశలన్నీ నీరుగారి వలస బండి కదులుతూనే ఉంది. పాలకులు కళ్లు అప్పగించి చూస్తూనే ఉన్నారు.

17,236

1254

12,200

322

21,454

213

13,528

342

16,964

213

14,873

508

15,682

956

ఒకటి కంటే ఎక్కువ

పంటల సాగు (హెక్టార్లలో)

జిల్లాలో వ్యవసాయం ఒక కారు పంటకు మాత్రమే పరిమితం కావడంతో రైతులు, వ్యవసాయ కూలీలకు బతుకు భారం అవుతోంది. దీంతో ఏటా అక్టోబర్‌ నుంచే వలసలు పెరుగుతున్నాయి. జిల్లా నుంచి వ్యవసాయ కూలీలు, చిన్న సన్నకారు రైతులు కనీసం 2 లక్షల కుటుంబాలు వలస బాట పడుతున్నాయి. పశ్చిమ ప్రాంతం పూర్తిగా వర్షాధారంపైనే ఆధారపడింది. ఒక పంటకు మాత్రం పరిమితం కావడంతో పలు మండ లాల్లో ఇప్పటికే వ్యవసాయ పనులు పూర్తయ్యాయి. దీంతో స్థానికంగా ఉపాధి పనులు లేకపోవడం, అక్కడక్కడా ఉపాధి పనులు జరుగుతున్నా.. వేతనం రూ.100 లోపే వస్తుంది. దిక్కుతోచక కుటుంబ పోషణ కోసం భార్య పిల్లలతో వలసబాట పడుతున్నారు. ఇప్పటికే పెద్దకడుబూరు, ఆదోని, కోసిగి, మంత్రాలయం, కౌతాళం, హాలహర్వి, హొళగుంద, తుగ్గలి, దేవనకొండ, పత్తికొండ తదితర మండలాల నుంచి వేలాది కుటుంబాలు వలస వెళ్లాయి. ఈ క్రమంలో జిల్లా పశ్చిమ ప్రాంతంలో పాఠశాలల్లో హాజరు 30–40 శాతం వరకు పడిపోయింది.

18,481

1,115

31,055

955

కర్నూలు(అగ్రికల్చర్‌): వివిధ జిల్లాలతో పోలిస్తే కర్నూలు జిల్లాలో సాగు భూమికి కొదవ లేదు. జిల్లాలో మొత్తం రైతులు 3,95,498 ఉన్నారు. వీరిలో చిన్న, సన్న కారు రైతులు అంటే..రెండు హెక్టార్లలోపు భూములు కలిగిన వారు 3,06,293 మంది ఉన్నారు. వీరికి 5,90,667 హెక్టార్ల భూములు ఉన్నాయి. ఇందులో 5,45,157 హెక్టార్లు సాగుకు యోగ్యం కాగా 5,05,573 హెక్టార్లలో ఏడాదిలో ఒక కారు పంట మాత్రమే సాగు చేయాల్సి వస్తోంది. కేవలం వర్షాధారంపై ఆధారపడటంతో ఇంత భారీ ఎత్తున భూములు ఒక్క పంటకు మాత్రమే పరిమితం అవుతున్నాయి. 39,584 హెక్టార్లలో మాత్రమే ఏడాదికి ఒకటి కంటే ఎక్కువ పంటలు సాగు అవుతున్నాయి. మొత్తం భూమిలో కనీసం 50 శాతం భూముల్లో ఏడాదిలో ఒకటి కంటే ఎక్కువ పంటలు సాగు కావాల్సి ఉంది. అప్పుడే ఇటు రైతులు.. అటు వ్యవసాయ కూలీలకు ఏడాదిలో 9–10 నెలల వరకు పనులు ఉంటాయి. జిల్లాలో మొత్తం సాగు భూమి 5.90 లక్షల హెక్టార్లు ఉన్నప్పటికీ.. ఇందులో కేవలం 6.7 శాతం భూముల్లో అంటే 39,584 హెక్టార్లలోనే ఒకటి కంటే ఎక్కువ పంటలు (ఏరియా సోన్‌ మోర్‌దెన్‌ వన్స్‌) సాగు అవుతున్నాయి. విస్తారంగా వ్యవసాయ భూమి ఉన్నప్పటికీ ఇందులో కేవలం నాలుగైదు నెలలే పంటలు ఉంటున్నాయి. జిల్లాలో నల్ల రేగడి నేలలు ఎక్కువగా ఉండటంతో కొన్ని ప్రాంతాల్లో ఖరీఫ్‌లో ఈ భూములను ఖాళీగా ఉంచి రబీలో శనగ సాగు చేస్తున్నారు. సాగునీటి సమస్యతో ఖరీఫ్‌ లేదా రబీల్లోనే ఒక్క పంట మాత్రమే సాగు చేయాల్సి వస్తోంది.

తుంగభద్ర ఉన్నా.. సాగునీటి కష్టాలే..

జిల్లాలోని వివిధ మండలాల మీదుగా తుంగభధ్ర నది ప్రవహిస్తోంది. పశ్చిమ ప్రాంతంలో నదికి అనుబంధంగా ఎల్లెల్సీ కాలువ ఉన్నా... నీరు మాత్రం అంతంతే వస్తుంది. ఎత్తిపోతల పథకాలు ఉన్నా ఉపయోగం లేదు. ఎల్లెల్సీ ఉండటంతో 39,584 హెక్టార్లలో ఒకటి కంటే ఎక్కువ పంటలు ఉన్నాయి. వాస్తవంగా ఈ కాల్వ పరిధిలో జిల్లాలో 74 వేల హెక్టార్లకు నీటి సదుపాయం స్థిరీకరించారు. 39 వేల హెక్టార్లకు మాత్రమే నీరు అందుతోంది. భూముల్లో ఏడాదికి ఒకటి కంటే ఎక్కువ పంటలు పండించుకోవాలంటే వేదవతి ప్రాజెక్టు అత్యవసరం. ఇది సాకారం అయితేనే వలసల నివారణ సాధ్యమవుతుంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలనలో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి డీపీఆర్‌ సిద్ధమైంది. అయితే కూటమి ప్రభుత్వంతో ఈ ప్రాజెక్టుకు గ్రహణం పట్టినట్లు అయింది. మరోవైపు తుంగభద్రపై గుండ్రేవుల దగ్గర ప్రాజెక్టు నిర్మాణానికి సైతం రూపకల్పన చేసింది. ఇప్పుడు దీని ఊసే లేకుండా పోయింది.

‘అడా’ ఏదీ?

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వలసలను సమూలంగా నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. వలసలపై నిపుణుల కమిటీ ద్వారా అధ్యయనం చేయించింది. వారి నివేదిక ఆధారంగా ‘ఆదోని ఏరియా డెవలప్‌మెంటు అథారిటీ’ (అడా) ఏర్పాటు చేసింది. ఇందు లో 17 మండలాలు ఉన్నాయి. ఇందులో అన్ని ప్రభుత్వ శాఖలను భాగస్వాములుగా చేసింది. అన్ని శాఖల ద్వారా పశ్చిమ ప్రాంత వెనుకబాటుతనంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకు పకడ్బందీగా కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం అయ్యాయి. ఇందులో భాగంగానే టమాట ప్రాసెసింగ్‌ ఇండస్ట్రీతో పాటు పలు చిరుధాన్యాల ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. అయితే ప్రభుత్వం మారడంతో ‘అడా’ మనుగడ కోల్పోయింది. కూటమి ప్రభుత్వం దీనిని పూర్తిగా పక్కన పెట్టడంతో పాటు పశ్చిమ ప్రాంతాల వెనుకబాటు తనం గురించి పట్టించుకునే పరిస్థితే లేకుండా పోయింది.

సాగు భూమి విస్తీర్ణం (హెక్టార్లలో)

25,388

717

ఏటా 2 లక్షల

కుటుంబాల

వలస బాట..

29,954

746

19,182

828

20,127

401

21,195

913

26,654

1,129

జిల్లాలో రైతులు, భూ కమతాల వివరాలు

కేటగిరి భూమి స్థాయి రైతుల సాగుభూమి

హెక్టార్లలో సంఖ్య (హెక్టార్లలో)

సన్నకారు 1 1,88,189 1,02,496.3

చిన్నకారు 1-2 1,18,104 1,68,190

సెమీ మీడియం 2-4 66,425- 1,78,380

మీడియం 4-10 21,337 1,18,255

పెద్ద(లార్జ్‌) 10పైన 1443 23,346.52

No comments yet. Be the first to comment!
Add a comment
 ఏడాదిలో ఒకటి కంటే ఎక్కువ పంటలు సాగు వివరాలు  మండలాల వా1
1/3

ఏడాదిలో ఒకటి కంటే ఎక్కువ పంటలు సాగు వివరాలు మండలాల వా

 ఏడాదిలో ఒకటి కంటే ఎక్కువ పంటలు సాగు వివరాలు  మండలాల వా2
2/3

ఏడాదిలో ఒకటి కంటే ఎక్కువ పంటలు సాగు వివరాలు మండలాల వా

 ఏడాదిలో ఒకటి కంటే ఎక్కువ పంటలు సాగు వివరాలు  మండలాల వా3
3/3

ఏడాదిలో ఒకటి కంటే ఎక్కువ పంటలు సాగు వివరాలు మండలాల వా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement