టానిక్ వికటించి 30 గొర్రెల మృత్యువాత
సి.బెళగల్: గొర్రెల పెంపకందారుల సొంత వైద్యం వికటించి 30 జీవాలు మృత్యువాత పడిన సంఘటన సి.బెళగల్ మండలం తిమ్మందొడ్డి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చిన్న గోరంట్లకు 600కు పైగా గొర్రెలు ఉన్నాయి. ఈ క్రమంలో శనివారం గొర్రెలకు బలం కోసం వైద్యుల సిఫార్సు లేకుండా సొంతంగా టానిక్ తీసుకొచ్చి తాపించాడు. అధిక డోస్ టానిక్‌ను గొర్రెలకు తాపడంతో వికటించి శనివారం రెండు గొర్రెలు మృతి చెందగా, ఆదివారం ఉదయం 6 గంటలకు ఒక్కసారిగా 28 గొర్రెలు అస్వస్థతకు గురై మృతి చెందాయి. విషయం తెలుసుకున్న పోలకల్ పశువైద్యుడు రొనాల్డ్ రిచర్డ్ పోలకల్, కొత్తకోట పశు వైద్యశాలల సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని మృతి చెందిన గొర్రెలను పరిశీలించారు. అనారోగ్యంతో ఉన్న గొర్రెలకు వైద్యం అందించారు. మృతి చెందిన గొర్రెల కళేబరాలకు పోస్టుమార్టం నిర్వహించగా.. టానిక్ అధిక డోసు తాపడం వల్లే జీవాలు మృత్యువాత పడినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది. అలాగే చనిపోయిన గొర్రెల అంతర్గత భాగాలను సేకరించి కర్నూలు ల్యాబ్‌కు పంపించారు.
వైద్యుల సిఫార్సు లేకుండా సొంతంగా అధిక డోసు ఇవ్వడంతో దుర్ఘటన
Comments
Please login to add a commentAdd a comment