నాటుసారా తయారు చేస్తే పీడీ యాక్ట్
నందికొట్కూరు: మండల పరిధిలోని కోళ్లబావాపురం గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో నాటుసారా తయారు చేసేందుకు సిద్ధంగా ఉంచిన 600 లీటర్ల బెల్లం ఊటను ఆదివారం ఎకై ్సజ్ సీఐ, ఎస్‌ఐ జఫ్రుల్లా, పోలీసులు ధ్వంసం చేశారు. జిల్లా ఎకై ్సజ్ అధికారి ఆదేశాల మేరకు.. ఆ శాఖ పోలీసులు మండలంలోని నాటుసారా స్థావరాలపై విస్తృత దాడులు నిర్వహించారు. షికారి దుర్గ అనే మహిళ వద్ద 20 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. నాటుసారా తయారుచేసినా, విక్రయించినా, ఇతర ప్రాంతాలకు తరలించినా క్రిమినల్ కేసులు పెట్టడంతో పాటు వాహనాలను సీజ్ చేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు. దాడుల్లో ఎకై ్సజ్ హెడ్ కానిస్టేబుళ్లు కృపవరకుమారి, శంకర్‌నాయక్, రాజు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment