తెరుచుకున్న రేషన్‌షాపులు
ఆదోని రూరల్: ఆదోని పట్టణంలో కూటమి నాయకులు దౌర్జన్యంగా మూత వేసిన రేషన్‌షాపులు ఎట్టకేలకు తెరుచుకున్నాయి. స్థానిక ఎమ్మెల్యే పార్థసారథి ఇటీవల జరిగిన సమావేశంలో రేషన్ డీలర్లు స్వతహాగా తప్పుకొని తమ కార్యకర్తలకు దుకాణాలు అప్పగించాలని లేకపోతే దౌర్జన్యంగా వాటిని స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు. దీంతో కూటమి నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోయి పట్టణంలో 9 దుకాణాలకు తాళాలు వేశారు. దీనిపై బాధిత డీలర్లు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం ఆందోళన చేసి విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన స్పందించి రెవెన్యూ అధికారులు, పోలీసులకు ఆదేశాలు జారీ చేయడంతో వారు దుకాణాల తాళాలను పగలగొట్టి సంబంధిత డీలర్లకు వాటిని అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment