ఆర్‌బీకే శిలాఫలకం ధ్వంసం
నంద్యాల(అర్బన్): మండల పరిధిలోని మిట్నాల గ్రామ సమీపంలో ఏర్పాటైన రైతు భరోసా కేంద్రం (ప్రస్తుతం రైతు సేవా కేంద్రం) శిలాఫలకాన్ని దుండగులు ధ్వంసం చేశారు. వైఎస్సార్‌సీపీ హయాంలో రూ.21 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని అప్పటి నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి ప్రారంభించారు. మూడు రోజుల క్రితం దుండగులు శిలాఫలకాన్ని ధ్వంసం చేశారన్న సమాచారంతో స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు ఇప్పల చిన్న తిరుపతిరెడ్డి, గోపాల్‌రెడ్డి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా శిలాఫలకం ధ్వంసం విషయం ఎవరికీ చెప్పవద్దని తిరిగి ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు నాయకులకు హామీ ఇవ్వడం గమనార్హం. కాగా ఇలాంటి ఘటనలు జరగకుండా దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ గ్రామ నాయకులు రాజశేఖర్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment