పెయింటర్ దుర్మరణం
గోనెగండ్ల: మండల పరిధిలోని హెచ్.కై రవాడి – పెద్దనేలటూర్ గ్రామాల మధ్య శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పెయింటర్ దుర్మరణం చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. పెద్దనేలటూర్ గ్రామానికి చెందిన గోరంట్ల(25) గోనెగండ్లలో పెయింటింగ్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రోజు మాదిరిగానే ఉదయం గోనెగండ్లకు వచ్చాడు. సాయంత్రం బైక్‌పై గ్రామానికి బయలుదేరాడు. హెచ్. కై రవాడి నుంచి పెద్దనేలటూర్‌కు వెళ్లే దారిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద బైక్ టైర్ పగిలిపోవడంతో అదుపుతప్పి కింద పడ్డాడు. తలకు తీవ్రగాయం కావడంతో కోడుమూరుకు తరలిస్తుందగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడికి భార్య శృతి, రెండేళ్ల కుమారుడు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ గంగాధర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment