తూతూమంత్రంగా..
కర్నూలు(అగ్రికల్చర్)/ నంద్యాల (అర్చన్): ఇంటి దగ్గరే పింఛన్ల పంపిణీ మాటలకే పరిమితమైంది. జనవరి నెలకు సంబంధించిన పంపిణీ కూడా సచివాలయాలు, రచ్చబండల దగ్గరే జరిగింది. 1వ తేదీ నూతన సంవత్సర వేడుకలు జరుగుతుండటంతో ఒకరోజు ముందుగానే అంటే ఈనెల 31వ తేదీన పింఛన్లు పంపిణీ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మంగళవారం ఉదయం కొద్దిసేపు వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగులు ఇంటి దగ్గర పంపిణీ జరగగా ఆ తర్వాత యథాప్రకారం సచివాలయాలు, రచ్చ బండల దగ్గరకు మారింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పింఛన్ల పంపిణీ జరగడం ఏడో సారి.అయితే ఇప్పటి వరకు ఒకసారి కూడా పూర్తిస్థాయిలో ఇంటి దగ్గర పింఛన్ల పంపిణీ విజయవంతంగా జరగలేదు. దీంతో వేలాది మంది వికలాంగులు, వయోవృద్ధులు, కిడ్ని బాధితులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో వలంటీర్లు ఐదేళ్లు లబ్ధిదారులకు ఇంటి దగ్గరే పింఛన్ సొమ్ము అందజేశారు. దీంతో అవ్వాతాతలు, వికలాంగులు, వ్యాధి గ్రస్తులు ఎవరూ ఇబ్బంది పడలేదు. తెలుగుదేశం, జనసేన పార్టీల కుట్రల వల్ల ఈ ఏడాది ఏప్రిల్ నుంచి పింఛన్‌దారులకు కష్టాలు మొదలయ్యాయి.
కర్నూలులో 95.95 శాతం పంపిణీ...
జనవరి నెలకు సంబంధించి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో కర్నూలు జిల్లా 8వ స్థానంలో నిలిచింది. జిల్లాలో 2,39,818 పింఛన్‌దారులుండగా.. సాయంత్రం 6 గంటల సమయానికి 2,30,108 (95.95 శాతం)మందికి పింఛన్ అందజేశారు. ఇదిలా ఉంటే జిల్లా కలెక్టర్ రంజిత్‌బాషా మంగళవారం ఉదయం జొహరాపురం రోడ్డులోని లక్ష్మీగార్డెన్స్ పూల సుబ్బయ్య నగర్లో లక్ష్మీదేవి (దివ్యాంగురాలు), రామలక్ష్మి(వితంతువు), నాగమణి (ఒంటరి మహిళ) తదితర లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేశారు.
గంటన్నర పాటే ఇంటిదగ్గర పింఛన్ల పంపిణీ
తర్వాత సచివాలయాలు, రచ్చబండ వద్ద అందజేత
Comments
Please login to add a commentAdd a comment