పంటలకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ నిర్ధారణ
కర్నూలు (సెంట్రల్): 2025–26కు సంబంధించి వివిధ పంటలకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను నిర్ధారించినట్లు కలెక్టర్ పి.రంజిత్ బాషా తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు ఆధ్వర్యంలో జిల్లాస్థాయి సాంకేతిక సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ, మత్స్య శాఖ, ఉద్యాన, పశుసంవర్థక శాఖలకు సంబంధించి వివిధ రకాల రుణాల మంజూరు కోసం స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ను నిర్ధారించినట్లు చెప్పారు. పెంచిన వివరాల ప్రతిపాదనలను రాష్ట్రస్థాయి సాంకేతిక కమిటీకి పంపించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కేడీసీసీ బ్యాంకు సీఈఓను ఆదేశించారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, కేడీసీసీ బ్యాంక్ సీఈఓ విజయ్ కుమార్, డీసీసీ బ్యాంక్ జనరల్ మేనేజర్ రామాంజనేయులు, ఎల్‌డీఎం రామచంద్రరావు, నాబార్డు డీడీఎం సుబ్బారెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వరలక్ష్మి, ఉద్యాన శాఖ అధికారి, బ్యాంకర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment