పంచాయతీ వింగ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా చంద్రకాంత్
కర్నూలు (అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లా కలెక్టర్ పంచాయతీ విభాగం ఏవో, మినిస్టీరియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడుగా వి.చంద్రకాంత్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం సాయంత్రం స్థానిక మండల పరిషత్ సమావేశ భవనంలో పంచాయతీ ఉద్యోగుల జిల్లా స్థాయి సమావేశం జరిగింది. జిల్లా అధ్యక్షులుగా ఇప్పటివరకు కొనసాగిన జీఎన్‌ఏ ప్రసాద్ రాష్ట్ర కార్యవర్గానికి ఎంపిక కావడం పట్ల అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలోనే జిల్లా అధ్యక్షులుగా చంద్రకాంత్ రెడ్డిని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర నాయకులు ప్రసాద్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ పంచాయతీ విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు అసోసియేషన్ ఎళ్లవేళలా అండగా ఉంటుందన్నారు. అనంతరం నూతన అధ్యక్షుడిని ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం పరిపాలన అధికారి ప్రతిమ, ఉమ్మడి జిల్లాకు చెందిన నాయకులు శ్రీనివాసరెడ్డి, శివ, మారుతి, శిరీష తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment