పిల్లలతో పాటు వలసబాట
వలసలు ఆగడం లేదు. పల్లెలు ఖాళీ అవుతున్నాయి. ఉపాధి పనులు కల్పించకపోవడంతో వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. గ్రామాల్లో దండోరాలు వేయించి పనులు కల్పిస్తున్నామని అధికారులు చెబుతున్నారే కానీ క్షేత్ర స్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు.
ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి శని, ఆది వారాల్లో దాదాపు 2,500 మందికి పైగా వలస కూలీలు గుంటూరుకు పొట్టచేత పట్టుకుని బయలుదేరారు.
కొత్తపల్లి మండలం వీరాపురం, సింగరాజుపల్లె, ముసలిమడుగు, గువ్వలకుంట్ల, కొత్తపల్లితోపాటు అన్ని గ్రామాల నుంచి వలస వెళ్లారు. కృష్ణగిరి మండల పరిధిలోని పెనుమాడ గ్రామం నుంచి 40 కుటుంబాలు గుంటూరుకు వలస వెళాయి. మూటాముల్లె సర్దుకుని విద్యార్థులను బడి మానిపించి వారి వెంట తీసుకెళ్లారు. – కొత్తపల్లి/కృష్ణగిరి
Comments
Please login to add a commentAdd a comment