పెట్రోలుతో ఆడుకుంటుండగా నిప్పంటుకుని బాలుడికి తీవ్ర గాయ
ఆస్పరి: ఇద్దరు చిన్నారులు పెట్రోలుతో ఆడుకుంటుండగా నిప్పంటుకుని ఓ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పరి మండలం బిల్లేకల్లులో జరిగిన ఈ ప్రమాదం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ఈ నెల 3న స్థానిక ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న అరవింద్, వికాష్‌లు ఆడుకునేందుకు వెళ్లారు. గ్రామంలో బస్టాప్ దగ్గర నిలిపి ఉన్న స్కూటర్‌కు ఉన్న పైపు ను ఊడదీసి చెరో చిన్న ప్లాస్టిక్ బాటిళ్లలో పెట్రోలు నింపుకొన్నారు. అనంతరం వికాష్.. అరవింద్ ఒంటిపై పెట్రోల్ జల్లి నిప్పంటించాడు. దీంతో అరవింద్ ఒంటినిండా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో వికాష్ అక్కడి నుంచి పరుగులు పెట్టాడు. గ్రామస్తులు మంటలార్పేలోగా అరవింద్ తీవ్రంగా గాయపడ్డాడు. బాలుడిని ఆస్పరి ప్రాథమిక ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం ఆదోని ప్రభుత్వాస్పత్రికి.. అక్కడి నుంచి కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు.
తల్లీ బిడ్డ అదృశ్యం
కొత్తపల్లి: మండలకేంద్రం కొత్తపల్లికి చెందిన తల్లీబిడ్డ అదృశ్యమయ్యారు. ఎస్‌ఐ ఎం.కేశవ తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన మానిపాటి నాగేశ్వరరావుకు 3 ఏళ్ల క్రితం మానిపాటి అనూషతో వివాహమైంది. వీరికి రెండేళ్లు, ఆరునెలల వయస్సు గల ఇద్దరు కుమారులున్నారు. ఆదివారం మధ్యా హ్నం భర్త నాగేశ్వరరావు పశువుల దొడ్డి దగ్గరికి పనిపై వెళ్లాడు. తిరిగి వచ్చేలోపు భార్య అనూ ష, చిన్న కుమారుడు సూర్యవర్ధన్ కనిపించకుండాపోయారు. చుట్టుపక్కల, బంధువుల ఇళ్లలో గాలించగా ఎక్కడా ఆచూకీ లభించలేదు. దీంతో నాగేశ్వరావు సోమవారం పోలీసులను ఆశ్రయించాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెల్లడించారు. ఆచూకీ తెలిసిన వారు 9121101185, 9121101181 నంబర్లకు తెలియజేయాలని ఆయన కోరారు.
Comments
Please login to add a commentAdd a comment