చేప పిల్లల అక్రమ తరలింపు
కర్నూలు(అగ్రికల్చర్): మత్స్యశాఖ కర్నూలు ఫామ్‌లో నాలుగు లక్షలకుపైగా చేప పిల్లల్ని పెంచుతుండగా కేసీ కెనాల్‌కు నీటి సరఫరా బంద్ కావడంతో అవి మరణిస్తున్నాయి. ఇక్కడ ఉన్న మూడు ఇంచుల చేప పిల్లలను శ్రీశైలం రిజర్వాయర్‌లో వదలాల్సి ఉన్నప్పటికీ సంబంధిత నియోజకవర్గం శాసనసభ్యులు షెడ్యూలు ఇవ్వకపోవడంలో ఆలస్యం జరుగుతోంది. అయితే ఆదివారం జిల్లా మత్స్యశాఖ అధికారికి సమాచారం లేకుండానే ఒక వాహనం ద్వారా చేప పిల్లలను సుంకేసులలోని మత్స్యశాఖ పామ్‌కు తరలిస్తామని చెప్పడం వివాదాస్పదం అయ్యింది. వెలుగోడుకు చెందిన వాహనం ఉపయోగించడంపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమాలకు బాధ్యులుగా మత్స్యశాఖ సహాయ ఇన్‌స్పెక్టర్ బాలరాజనే విమర్శలు వచ్చాయి.కాగా.. చేప పిల్లలను అక్రమంగా అమ్ముకుంటున్నారనే ఆరోపణలపై సమగ్రంగా విచారణ జరిపిస్తామని మత్స్యశాఖ డీడీ శ్యామల తెలిపారు. సోమవారం డీఎఫ్‌సీఎస్ కార్యాలయంలో డైరెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో డీఎఫ్‌సీఎస్ చైర్మన్ నవీన్‌కుమార్ మాట్లాడుతూ.. కొంతమంది చేపపిల్లలను అక్రమంగా అమ్మకోవడం దారుణమని, ఇందుకు బాధ్యులైన వారిని వదిలే ప్రసక్తే లేదన్నారు. సమావేశంలో వైస్ చైర్మన్ పెద్ద వీరేష్, డైరెక్టర్లు పోతుల శేఖర్, మద్దిలేటి, మల్లీశ్వరుడు, మత్స్యకార సంఘం నేతలు నాగశేషులు, భాస్కర్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
బాధ్యులైన వారిని వదిలే ప్రసక్తే లేదు
డీఎఫ్‌సీఎస్ చైర్మన్ నవీన్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment