విధిని ఓడించి..
ఆ కుటుంబానికి ఒక్కగానొక్క కుమారుడైన అతనిని విధి వెక్కిరించింది. మూడేళ్ల వయస్సులో పోలియో రూపంలో రెండు కాళ్లూ పనిచేయడం మానేశాయి. తనకు వైకల్యం వచ్చిందని అతను భయపడలేదు. అంకితభావం, మొండి ధైర్యంతో జీవితాన్ని నెట్టుకొస్తున్నాడు. ఆత్మకూరు మండలం నల్లకాలువ గ్రామానికి చెందిన వాల్మీకి నాగార్జున ప్రభు (43) కు చిన్నతనంలోనే పోలియో రావడంతో వైకల్యానికి వెరవకుండా చదువు సాగించాడు. స్టెనోగ్రాఫర్‌గా కూడా చదువు పూర్తి చేశాడు. చదివిన చదువుకు ఉద్యోగం రాకపోవడంతో ఏమాత్రం అధైర్యపడలేదు. మూడు చక్రాల మోటర్‌బైక్‌పై 2008 నుంచి ఊరూరూ తిరుగుతూ మొబైల్ ఫోన్లకు సిమ్ కార్డులు విక్రయించేవాడు. ఇటీవల అనారోగ్యం కారణంగా ఊర్లు తిరగడం మానేశాడు. కర్నూలులోని నంద్యాల చెక్‌పోస్టు ప్రాంతంలో తల్లిదండ్రులతో కలసి నివాసముంటూ వైద్యం చేయించుకుంటున్నాడు. మరోవైపు జీవన భృతి కోసం తన మూడు చక్రాల మోటర్‌బైక్‌పై రెడ్‌క్రాస్ రక్త నిధి వద్ద స్టాండ్ ఏర్పాటు చేసుకుని సిమ్ కార్డులు విక్రయిస్తున్నాడు. అన్ని కంపెనీల నూతన సిమ్ కార్డులు విక్రయించడంతో పాటు ఎంఎన్‌పీలు కూడా చేస్తూ జీవనం సాగిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు
Comments
Please login to add a commentAdd a comment