ప్రయాణికులకు విజ్ఞప్తి
● ప్యాసింజర్ల రైళ్ల నంబర్ల మార్పు
మద్దికెర: గుంతకల్లు, డోన్ మీదుగా వెళ్లే పలు ప్యాసింజర్ల రైళ్ల నంబర్లు మారాయి. గుంతకల్లు నుంచి బయలుదేరే కాచిగూడ, డోన్, కర్నూలు టౌన్ వరకు నడుస్తున్న ప్యాసింజర్ల రైళ్ల నంబర్లను రైల్వే శాఖ మార్చింది. కొత్త నెంబర్లు జనవరి 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చాయని మద్దికెర స్టేషన్ సూపరింటెండెంట్ పరమేశ్వరరెడ్డి సోమవారం తెలిపారు. అలాగే గుంతకల్లు – డోన్ రైలు బయలుదేరు వేళలో మార్పు చేశారని చెప్పారు. గతంలో ఉదయం 11.50కు వచ్చే ఈ రైలు ఇప్పుడు ఉదయం 11.18 గంటలకు మద్దికెర స్టేషన్‌కు వస్తుందన్నారు. ఈ మార్పును గమనించాలని సూచించారు.
పలు రైళ్ల రాక పోకలు ఆలస్యం
డోన్ రూరల్: కాచిగూడ నుంచి గుంతకల్‌కు వెళ్లే (57412) ప్యాసింజన్ రైలు ఈనెల 20, 27వ తేదీన 3.50 గంటలు , గుంతకల్ నుంచి బోధన్‌కు వెళ్లే (17253) ప్యాసింజర్ రైలు ఈనెల 20, 27వ తేదీన మూడు గంటలు ఆలస్యంగా ఆయా స్టేషన్లకు చేరుకుంటాయని రైల్వే అధికారులు సోమవారం తెలిపారు. అలాగే గుంటూరు నుంచి ఔరంగబాద్ వెళ్లె (17253) ఎక్స్‌ప్రెస్ రైలు ఈనెల 8 నుంచి 29 తేదీ వరకు గంట ఆలస్యంగా చేరుకుంటుందన్నారు.
రైలు పాతనెంబర్ కొత్త నెంబర్
గుంతకల్లు– కాచిగూడ 07611 57411
గుంతకల్లు – డోన్ 07288 77203
కర్నూలు టౌన్ – గుంతకల్లు 07292 77204
కాచిగూడ – గుంతకల్లు 07670 57412
Comments
Please login to add a commentAdd a comment