ఆత్మకూరు: పట్టణ శివారులో మంగళవారం నుంచి మూడు రోజుల పాటు ఇస్తెమా జరుగనుంది. ఈ ధార్మిక సమ్మేళనానికి ఉమ్మడి కర్నూలు జిల్లా, వైఎస్సార్ జిల్లాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ముస్లింలు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఆత్మకూరు నుంచి శ్రీశైలం వెళ్లే దారిలో దాదాపు 300 ఎకరాల్లో ఇస్తెమా నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. గత కొద్ది రోజులుగా వివిధ ప్రాంతాల నుంచి ముస్లింలు స్వచ్ఛందంగా వాహనాల్లో తరలివచ్చి మైదానం చదును, పరిసరాల పరిశుభ్రత, చలువ పందిళ్ల ఏర్పా టు తదితర పనుల్లో పాలుపంచుకుంటున్నారు. అలాగే విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్యం, రవాణా తదితర సౌకర్యాల కల్పన పనులు తుదిదశకు చేరాయి. ఈ సమ్మేళనలో మత గురువులు ఇస్లాం ధర్మం సందేశం ఇవ్వనున్నారు. కాగా ఇస్తెమా కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు ఆ కమిటీ సభ్యులు రజాక్ వెల్లడించారు. శాంతి భద్రతలతో పాటు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటు న్నట్లు డీఎస్పీ రామాంజినాయక్ తెలిపారు.
రేపటి నుంచి ఆత్మకూరు శివారులో మూడురోజుల పాటు ధార్మిక సమ్మేళనం
తరలిరానున్న లక్షలాది ముస్లింలు
Comments
Please login to add a commentAdd a comment