నయా మోసం
గడివేముల: సైబర్ నేరగాళ్లు రోజురోజుకు కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. సెకన్ల వ్యవధిలో ప్రజల డబ్బును దోచుకునేందుకు ఏమార్చుతున్నారు. తాజాగా యూపీఏ యూజర్లే లక్ష్యంగా జంప్డ్ డిపాజిట్ స్కామ్‌కు పాల్పడుతున్నారు. మండల కేంద్రమైన గడివేముల గ్రామానికి చెందిన పరమేష్ గౌడ్ అకౌంట్‌కు రూ.3.24 లక్షలు జమ అయినట్లు ఆదివారం ఫోన్‌కు మేసేజ్ వచ్చింది. డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని బ్యాలెన్స్ చెక్ చేసుకోగా అదే మొత్తం కనిపించింది. అయితే ఆ అమౌంట్‌ను ఇతరులకు ట్రాన్స్‌ఫర్ చేస్తుంటే పోవడం లేదు. అనుమానంతో ఆన్‌లైన్‌లో చూస్తే తన అకౌంట్‌లో జీరో కనిపిస్తోంది. ఉండాల్సిన రూ.1,600 కూడా లేదు. ఎవరైనా తన అకౌంట్‌కు నగదు ట్రాన్స్‌ఫర్ చేస్తే క్షణాల్లో మాయమవుతోంది. తన అకౌంట్‌ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారని పసిగట్టి అకౌంట్‌కు ఎవరూ డబ్బులు పంపకుండా జాగ్రత్త పడ్డాడు.
రూ. 3.24 లక్షలు డిపాజిట్ చేసినట్లు
సైబర్ నేరగాళ్ల బురిడీ
అకౌంట్‌ను హ్యాక్ చేసి
డబ్బులు కాజేసే యత్నం
Comments
Please login to add a commentAdd a comment