దురుద్దేశంతోనే..
దివ్యాంగుల పింఛన్ల తొలగింపునకు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. అర్హతే ప్రామా ణికంగా తీసుకొని గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేసింది. నేడు రాజకీయ దురుద్దేశంతో కూటమి ప్రభుత్వం పింఛన్లు తొలగించేందుకు చర్యలు తీసుకోవడం దారుణం. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలైనప్పటికీ ఒక్క కొత్త పింఛన్ కూడా ఇవ్వలేదు. చాలా దారుణంగా పాలన సాగిస్తున్నారు.
– వి.రామాంజనేయులు, వికలాంగుల సమాఖ్య అధ్యక్షుడు, ఆలూరు మండలం
16 రోజుల పాటు పరిశీలన
హెల్త్, దివ్యాంగుల పింఛన్ల పరిశీలన కార్యక్రమం ఈ నెల 6వ తేదీ నుంచి ప్రారంభమై 16 రోజుల పాటు జరుగుతుంది. రోజుకు 15 నుంచి 25 ఇళ్లకు వెళ్లి వెరిఫికేషన్ చేస్తారు. వివరాలు మొబైల్ యాప్‌లో నమోదు చేస్తారు. ఇందుకోసం వైద్య నిపుణులతో జిల్లాకు మూడు టీమ్‌లు ఏర్పాటు చేశాం. అనంతపురం జిల్లాకు చెందిన ఆర్థోపెడిక్ సర్జన్‌లు, జనరల్ మెడిసిన్ వైద్యులు వస్తున్నారు.
– నాగశివలీల, డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్, కర్నూలు
Comments
Please login to add a commentAdd a comment