డిక్కీ బోల్టు కోసి..
● 30 బ్యాగులను ఎత్తుకెళ్లిన దుండగులు
● ఆవేదనతో వెనుదిరిగిన భక్తులు
మహానంది: తమిళనాడు రాష్ట్రంలోని తిరుత్తణి నుంచి మహానందీశ్వరుడి దర్శనార్థం సుమారు 30 మంది భక్తులు కర్ణాటకకు చెందిన ఓ ట్రావెల్ బస్సు లో శనివారం తెల్లవారుజామున మహానందికి వచ్చారు. కొద్దిసేపు ఆ బస్సులోనే నిద్రించి ఆరు గంటల సమయంలో డిక్కీ ఓపెన్ చేశారు. ఏ ఒక్క ల గేజీ బ్యాగు కనిపించకపోవడంతో ఖంగు తిన్నారు. డిక్కీకి ఉన్న బోల్టును కోసి తీసుకెళ్లినట్లు గుర్తించారు. తర్వాత తమ 30 బ్యాగులు కనిపించడం లేదని భక్తులు మహానంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ రామ్మోహన్‌రెడ్డి సీసీ కెమెరాలను పరిశీలించడంతో పాటు సిబ్బంది ద్వారా చుట్టుపక్కల వెతికించారు. ఎలాంటి ఆనవాళ్లు లేకపోవడంతో భక్తులు నిరాశతో వెనుతిరిగారు. కాగా శుక్రవారం రాత్రి భక్తులు తిరుపతి సమీపంలో భోజనాలు చేసి సుమారు గంటన్నర వరకు హైవేలో బస్సు ఆపి విశ్రాంతి తీసుకున్నారు. అక్కడే చోరీ జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment