మోసం.. రూ. 21లక్షలు మాయం!
పెద్దకడబూరు: డబ్బులు రెట్టింపు చేస్తామని చెప్పి రూ. 21లక్షలు మాయం చేసిన ఘటన హెచ్.మురవణి గ్రామంలో చోటుచేసుకుంది. సీఐ బీఏ మంజునాథ్, ఎస్‌ఐ నిరంజన్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన పీబీ వెంకటేష్ ఫోన్‌లోని వాట్సాప్ మెసేజ్ ద్వారా తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లా శాశంపల్లి గ్రామానికి చెందిన సంధుల రవి(35)తో పరిచయం ఏర్పడింది. డబ్బులు రెట్టింపు చేస్తామని వీడియోలు పంపడంతో నమ్మి వెంకటేష్ హైదరాబాద్‌కు వెళ్లి పరిశీలించాడు. తన దగ్గర డబ్బులు ఉన్నాయని, వాటిని రెట్టింపు చేయాలని కోరడంతో రవితో పాటు మరో నలుగురు(మొత్తం ఐదుగురు) డిసెంబర్ నెలలో హెచ్.మురవణి గ్రామానికి వచ్చారు. పూజాసామగ్రి, డబ్బులు ఉన్న పెట్టెలను స్వామీజీలకు అప్పగించగా మాయమాటలు చెప్పి, ఇంటి వారిని బయటకు పంపి పూజలు చేశారు. పెట్టెలను తెరవకుండా వాటితోపాటు అందరూ మంత్రాలయం వెళ్లి అక్కడ తుంగభద్రలో స్నానం చేసి.. మూడు రోజుల తరువాత పూజచేసి తెరవాలని సూచించారు. అనంతరం వారు అక్కడి నుంచి తమ ఊర్లకు వెళ్లిపోయారు. మూడు రోజుల తరువాత పెట్టెలు తెరవగా అందులో ఉంచిన రూ. 21లక్షలు మాయం కావడంతో పోలీస్‌లను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శనివారం కంబలదిన్ని గ్రామం వద్ద ఉన్న రవిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. ఇంకా పరారీలో ఉన్న నలుగురిని కూడా త్వరలోనే పట్టుకొని డబ్బులు రికవరీ చేస్తామని సీఐ, ఎస్‌ఐ తెలిపారు. ఇదిలా ఉండగా గతంలో గ్రామంలో ఓ ఇంట్లో జరిగిన చోరీ కేసులో పీబీ వెంకటేష్ నిందితుడిగా ఉన్నారు.
ఒక నిందితుడు అరెస్టు,
పరారీలో నలుగురు
Comments
Please login to add a commentAdd a comment