వ్యవసాయ ఉద్యోగుల నూతన కార్యవర్గం ఎన్నిక
కర్నూలు(అగ్రికల్చర్):ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి అనుబంధంగా ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యవసాయ ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గం మంగళవారం ఏకగ్రీవంగా ఏర్పాటైంది. ఏపీజీఈఏ జిల్లా శాఖ అధ్యక్షుడు బంగి శ్రీధర్, రాష్ట్ర వ్యవసాయ ఉద్యోగుల సంఘం నేతలు రఘురామ నాయుడు, డీ.శ్రీహరి ముఖ్య అతిథులుగా హాజరై ఎన్నిక కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా ఎం.శ్రీహరి(నంద్యాల జిల్లా), కార్యదర్శిగా హెచ్.రూపేష్‌కుమార్ (కర్నూలు జిల్లా), సహా అధ్యక్షుడిగా ప్రవీణ్‌కుమార్, కోశాధికారిగా సాయికుమార్, ఉపా ధ్యక్షులుగా సునీల్‌కుమార్, ఎండీ ఆలీ, దివాక ర్, సంయుక్త కార్యదర్శులుగా జయరాజు, పి.కిశోర్, శివకమార్, కార్యనిర్వాహక కార్యదర్శులుగా రాజేష్, అలేఖ్య, జిల్లా ఈసీ మెంబర్లుగా జయరాములు, సాంబశివుడు, రాష్ట్ర ఈసీ మెంబరుగా విజయకుమార్ ఎన్నిక య్యారు. తర్వాత వీరు ప్రమాణ స్వీకారం చేశా రు. అనంతరం కలెక్టరేట్‌లోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి 2025 టేబుల్ క్యాలండర్ విడుదల చేశారు.
నేడు స్పర్శదర్శనం నిలుపుదల
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానంలో బుధవారం ఐచ్చిక సెలవు కారణంగా భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని, ఈ కారణంగా స్వామివార్ల స్పర్శదర్శనం పూర్తిగా నిలుపుదల చేసినట్లు శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment